ప్రజల్లో సానుభూతికోసమే..
అరెస్టు వారెంట్‌ను బాబు వాడుకుంటున్నారు
– బీజేపీ హస్తం ఉందన్న ఆరోపణలు అవాస్తవం
– టీడీపీ ముసుగు ధరించిన వ్యక్తి శివాజీ
– విలేకరుల సమావేశంలో బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి
అనంతపురం, సెప్టెంబర్14(జనంసాక్షి) : బాబ్లీ పేరుతో ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో సరికొత్త నాటకానికి తెరలేపారని బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దుకాణం బంద్ అయిన విషయాన్ని గ్రహించిన బాబు.. ఉనికిని కాపాడుకునేందుకు, ఓట్లు దండుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారంటూ విమర్శించారు. చంద్రబాబు నాన్ బెయిలబుల్ అరెస్టు వెనుక బీజేపీ హస్తం ఉందన్న ఆరోపణలను విష్ణువర్ధన్ రెడ్డి ఖండించారు. ఆకేసు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా అంటూ ప్రశ్నించారు. అయినా 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు కోర్టుకు హాజరు కాకపోతే అరెస్టు వారెంట్ వస్తుందన్న విషయం తెలీదా అంటూ ఎద్దేవా చేశారు. నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటు పేరిట తెలంగాణ ప్రజల సానుభూతి పొందేందుకు బాబు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ శివాజీ ‘ఆపరేషన్ గరుడా.. పెరుగు’ వడా అంటూ చేసిన ఫిర్యాదుపై విచారణ ఎందుకు చేపట్టలేదంటూ విష్ణువర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీ ముసుగు ధరించిన వ్యక్తి శివాజీ నాటకాలు ఎవరూ నమ్మరన్నారు. అయినా సిల్లీ గల్లీ కేసులకు సుప్రీంకోర్టు న్యాయవాదులు ప్రజల సొమ్ము లక్షల రూపాయలు వెచ్చిస్తారా అంటూ ప్రశ్నించారు.
వారెంట్ జారీపై రాద్ధాంతం చేస్తున్నారు – విష్ణుకుమార్‌రాజు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు నాన్‌బెయిలబుల్ వారెంటు జారీ కావడాన్ని కొందరు స్వార్ధపరులు రాజకీయం చేయడం సరికాదని విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు అన్నారు. శుక్రవారం విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుకు వారెంటు వస్తే… అది ఆపరేషన్ గరుడలో భాగంగానే వచ్చిందనుకోవడం సరైన పద్ధతి కాదని విశాఖలో తెలిపారు. ప్రజల కోసం పోరాటం చేసిన చంద్రబాబుకు నాన్‌బెయిలబుల్ వారెంటు వచ్చినంత మాత్రాన ఆయన ప్రతిష్ఠకు ఏవిూ భంగం వాటిల్లదని పేర్కొన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోవడం సహజమేనని… కానీ వీటిని కొందరు
పనిగట్టుకొని రాద్ధాంతం చేస్తున్నారని.. ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని సూచించారు.