ప్రజావిశ్వాసం లేని జాతీయ పార్టీలు: ఎమ్మెల్సీ
అనంతపురం,మే5(జనం సాక్షి ): జాతీయ పార్టీలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని రానున్న రోజుల్లో ప్రాంతీయపార్టీలదే హవా అని ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ మోసం చేస్తే విభజన చట్టంలోని హావిూలు, ప్రత్యేక హౌదా ఇవ్వకుండా బిజెపి తీరని ద్రోహం చేసిందన్నారు. రాష్ట్రాభిద్ధిని దృష్టిలో వుంచుకొని బిజెపితో జతకట్టామని తెలిపారు. అన్యాయం జరగడం వల్ల ఎన్‌డిఎ నుంచి బైటకొచ్చామని తెలిపారు. 26నుండి సైకిల్ యాత్ర చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. బిజెపిని, రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్న పార్టీలకు బుద్ధిచెప్పి వచ్చే ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తామని దీమా వ్యక్తం చేశారు.