ప్రజాసంకల్పయాత్ర చరిత్రలో నిలిచిపోతుంది
14న నుండి విశాఖపట్నంలో జగన్ పాదయాత్ర
విశాఖ గ్రావిూణ ప్రాంతాల్లో 210 కిలోవిూటర్ల మేర యాత్ర
ఏడు బహిరంగ సభల్లో వైఎస్ జగన్ పాల్గొంటారు
25 రోజుల పాటు జిల్లాలో పర్యటన
విలేకరుల సమావేశంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్
విశాఖపట్నం,ఆగస్ట్8(జనం సాక్షి): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర చరిత్రలో నిలిచి పోతుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. ఈ నెల 14న విశాఖపట్నం జిల్లాలో పాదయాత్ర ప్రవేశిస్తుందని తెలిపారు. ప్రస్తుతం జగన్ యాత్ర తూర్పుగోదావరిలో కొనసాగుతోంది. బుధవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ గన్నవరం మెట్టువద్ద జగన్ పాదయాత్ర జిల్లాలో ప్రవేశిస్తుందని చెప్పారు. వైఎస్ జగన్ పాదయాత్ర చరిత్రలో నిలిచి పోతుందని, అన్ని వర్గాల ప్రజలు వాళ్ల కష్టాల్ని ప్రతిపక్షనేతకు చెప్పుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని 102 నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ పాదయాత్ర చేశారని, ప్రతి నియోజకవర్గంలోనూ ఒక నిర్ధిష్టమైన ప్రకటన చేస్తున్నారని చెప్పారు. విశాఖ జిల్లా ప్రజలు కూడా జననేత వైఎస్ జగన్ పాదయాత్రకు మద్దతు తెలపాలని అమర్‌నాథ్ పిలుపునిచ్చారు. ఏపీకి సంజీవని లాంటి ప్రత్యేక ¬దా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు (లోక్‌సభ) 14 నెలల పదవీ కాలాన్ని త్యాగం చేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఏపీ హక్కుల కోసం వైఎస్సార్‌సీపీ నిరంతరం పోరాడుతునే ఉంటుందన్నారు. విశాఖ గ్రావిూణ ప్రాంతాల్లో 210 కిలోవిూటర్ల మేర పాదయాత్ర కొనసాగుతుందని, 7 బహిరంగ సభల్లో వైఎస్ జగన్ పాల్గొంటారని.. 25 రోజుల పాటు జిల్లాలో పర్యటన ఉంటుందని వెల్లడించారు. గిరిజన సమస్యలపై వైఎస్ జగన్ స్పష్టమైన ప్రకటన చేస్తారని, రైల్వేజోన్ అంశాన్ని మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్తామని గుడివాడ అమర్‌నాథ్ వివరించారు.