Monday, 2 November 2026

రెెండు నిమిషాలు ఆలస్యంఏ162 మంది ప్రాణాలు

తేలుతున్న శవాలు, శకలాలు

బంధువుల రోదనలు

జకార్తా,డిసెంబర్‌31(జనంసాక్షి): ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ నుంచి  రెండు నిమిషాలు ఆలస్యంగా ఆదేశాలు రావడం వల్లనే ఎయిర్‌ ఏషియా విమానం ప్రమాదానికి గురయ్యిందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పైలెట్‌ కోరిక మేరకు పైకి ఎగరాడనికి ఆదేవాలు ఆలస్యంగా రావడంతో కంట్రోల్‌ తప్పిందని బావిస్తున్నారు.  ఆ రెండు నిమిషాలు ముందుగా ఆదేశాలు వచ్చి ఉంటే 162 మంది ప్రాణాలు దక్కేవని, విమానం సముద్రంలో కూలి ఉండేది కాదని ఇప్పుడు విశ్లేషిస్తున్నారు.  మలేసియాకు చెందిన ఎయిర్‌ ఏషియా విమానం  కూలిపోవడానికి కేవలం రెండు నిమిషాల ఆలస్యమే కారణమైంది. ఈ విషయం తాజాగా విడుదలైన ఓ ట్రాన్‌స్క్రిప్టుల్రో తెలిసింది. ఎయిర్‌ ట్రాఫిక్‌ 8కంట్రోలుకు, ఎయిర్‌ ఏషియా విమానం పైలట్‌కు మధ్య జరిగిన సంభాషణ వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేదని, అందువల్ల తాను ఎడమవైపు తిరిగి మరి కొంత ఎత్తుకు వెళ్తానని పైలట్‌ కోరారు. ఎడమవైపు తిరిగేందుకు ఏటీసీ అనుమతించడంతో.. అలా ఏడుమైళ్ల దూరం వెళ్లారు. కానీ మరింత ఎత్తులో వెళ్తానని పైలట్‌ ఇర్యాంటో అడిగారు. ఎంత ఎత్తు అని ఏటీసీ నుంచి ప్రశ్న వచ్చింది. 38 వేల అడుగులు.. అని ఆయన చెప్పారు. కానీ దానికి ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ వెంటనే అవునని చెప్పలేకపోయింది. ఎందుకంటే.. అదే సమయానికి ఆ ఎత్తులో మరో ఆరు విమానాలు కూడా ఎగురుతున్నాయి. దాంతో తప్పనిసరిగా ఎయిర్‌ ఏషియా విమానం తక్కువ ఎత్తులోనే ఎగరాల్సి వచ్చింది. తీరా ఏటీసీ నుంచి సరే.. పైకి వెళ్లమని ఆదేశాలు వచ్చేసరికి రెండు నిమిషాలు గడిచింది. సరిగ్గా ఉదయం 6.14 గంటలకు ఎత్తుకు వెళ్లొచ్చన్నారు. కానీ ఆ ఆదేశాలకు తిరిగి సమాధానం రాలేదు. ఎందుకంటే.. అప్పటికే విమానం కూలిపోయింది!! పైలట్‌ ఇర్యాంటో సహా మొత్తం 162 మందీ జలసమాధి అయిపోయారు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *