Tuesday, 3 November 2026

ప్రత్యూష ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమా?

2ముంబయి: చిన్నారి పెళ్లికూతురు ధారావాహిక నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబయి పోలీసులు ఆమె ప్రియుడు రాహుల్‌ రాజ్‌సింగ్‌ను 14 గంటల పాటు విచారించారు. అయితే ప్రత్యూష ఆత్మహత్య చేసుకోవడానికి రాహుల్‌కి ఎలాంటి సంబంధం లేదని, తనకి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నట్లు తెలిసిందని పోలీసులు వెల్లడించారు. మరో పక్క ప్రత్యూష తల్లిదండ్రులు తమ కుమార్తె ఆత్మహత్య విషయంలో రాహుల్‌ ప్రమేయం లేదని చెబుతున్నారు.

మరో పక్క ప్రత్యూష ముక్కు, కళ్ల కింద గాయాలున్నాయని ఆ ఫొటోలుకూడా తీశామని ప్రత్యూష స్నేహితులు చెబుతున్నారు. ప్రత్యూషకి ఎలాంటిఆర్థిక ఇబ్బందులు లేవని పోలీసులకు తమ వివరణ ఇవ్వనున్నామని తెలిపారు. ఇటీవల ప్రత్యూషకు ఓ నిర్మాత షోలో పాల్గొనే అవకాశమిస్తే వ్యక్తిగత కారణాల వల్ల ప్రత్యూష ఒప్పుకోలేదని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *