ప్రత్యేకహోదా పోరు సభలో అపశ్రుతి

3

– యువకుడు ఆత్మాహుతియత్నం

తిరుపతి,ఆగస్ట్‌8(జనంసాక్షి): ఎపి ప్రత్యేక ¬దా కోసం తిరుపతిలో కాంగ్రెస్‌ నిర్వహించిన ‘పోరు సభ’లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ సభ వద్దే ఏపీకి ప్రత్యేక ¬దా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ కోటి అనే యువకుడు ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అంతకు ముందు అతను ప్రత్యేక ¬దా కోసం నినాదాలు చేశాడు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని ఆరోపించాడు. అనంతరం ఒక్కసారిగా తనవెంట తెచ్చుకున్న పెట్రోల్‌ పోసుకుని అంటించుకోవడంతో సభలో ఉన్నవారు షాక్‌కు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సభికులు యువకుని శరీరానికి అంటుకున్న మంటలను ఆర్పేశారు. చికిత్స కోసం బాధితుడిని రుయా ఆస్పత్రికి తరలించారు. శరీరం దాదాపు 70 కాలిపోవడంతో యువకుని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితుడికి మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు ఆస్పత్రి వైద్యులు కృషిచేస్తున్నారు. పోరు సభలో ఆత్మహత్యకు యత్నించిన యువకుడు తిరుపతి మంచాలవీధికి చెందిన బీఎంకే కోటిగా గుర్తించారు.  అక్కడున్న వారు సకాలంలో స్పందించి మంటలను ఆర్పివేసినా అప్పటికే అతడి శరీరం పూర్తిగా  కాలిపోయింది.  పోలీసుల సహాయంలో యువకుడిని రుయా ఆస్పత్రికి తరలించారు. శరీరం దాదాపుగా  కాలిపోవడంతో యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ససమాచారం. ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా కల్పించాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ శనివారం తిరుపతిలో కాంగ్రెస్‌ పార్టీ పోరుసభ ఏర్పాటుచేసింది. ఈ సభకు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు చిరంజీవి, కిల్లి కృపారాణి, పళ్లంరాజు సహా పలువురు మాజీ మంత్రులు, సీనియర్‌ నేతలు హాజరయ్యారు. సభలో నేతలు ప్రసంగిస్తున్న సమయంలోనే యువకుడు నినాదాలు చేస్తూ ఒంటిపై పెట్రోలు పోసుకున్నట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.  తిరుపతి మంచాలవీధికి చెందిన బి.ఎం.కె.కోటి కాంగ్రెస్‌ పార్టీలో కోటి క్రియాశీలంగా వ్యవహరించేవాడని.. ఏపీకి ప్రత్యేక¬దా రాకపోవడంపై అనేకసార్లు బాధపడేవాడని అతడి సన్నిహితులు చెబుతున్నారు. సభలో నేతలు ప్రసంగిస్తున్న సమయంలో భావోద్వేగానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది.  తిరుపతిలో కాంగ్రెస్‌ పోరు సభ వద్ద కోటి అనే యువకుడి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటనపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. యువకుడికి మెరుగైన చికిత్స అందిస్తామన్నారు. కోటికి కాంగ్రెస్‌ పార్టీ తరపున రూ.2లక్షల ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించారు.