Wednesday, 4 November 2026

ప్రత్యేక ¬దా తెలుగు ప్రజల హక్కు: జేపీ

అనంతపురం,మార్చి3(జ‌నంసాక్షి): ప్రత్యేక ¬దా తెలుగు ప్రజల హక్కు అని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌నారాయణ అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన నాలుగు ప్రధాన హావిూలను తక్షణం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతపురం సప్తగిరి కూడలిలో ‘తెలుగు భవిత – సంకల్ప దీక్ష’ పేరిట జేపీ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హావిూలు తక్షణం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. హావిూలు నెరవేర్చకపోతే.. ఆంధప్రదేశ్‌ భవిష్యత్‌ అంధకారంగా మారుతుందని, లక్షలాదిమంది యువత నిరుద్యోగులుగా మారతారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్టాన్రికి ప్రత్యేక ¬దా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఆర్థిక లోటు భర్తీ, పరిశ్రమల స్థాపను నెరవేర్చాలని కోరారు. కేంద్రంలో భాజపా వైఖరి ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు ఉందని విమర్శించారు. పలువురు లోక్‌సత్తా నాయకులు, కార్యకర్తలు దీక్షలో పాల్గొన్నారు. ఈనెల 5న విశాఖలో, 8న విజయవాడలో జేపీ దీక్ష చేపట్టనున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *