Tuesday, 3 November 2026

ప్రత్యేక ప్యాకేజీ కోసం డిమాండ్‌

కర్నూలు,మార్చి2(జ‌నంసాక్షి): రాష్ట్ర విభజన అనంతరం అన్ని విధాలుగా నష్టపోయిన రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేకప్యాకేజీ ప్రకటించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమాఖ్య నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ డిమాండుతో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కార్యాలయానికి లక్షపోస్టుకార్డులు పంపే ఉద్యమాన్ని సమాఖ్య  ప్రారంభించిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా కల్పించి, రాయలసీమ అభివృద్ధి కోసం లక్ష కోట్లతో ప్యాకేజీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇదిలావుంటే జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున కరవు ప్రాంతంగా ప్రకటించాలని పలువురు  ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.ముఖ్యమంత్రి జిల్లాకు ఇచ్చిన హావిూలను నేరవేర్చాలని, జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో భవిష్యత్తులో ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *