Tuesday, 3 November 2026

ప్రత్యేక ప్యాకేజీ పేరిట నాటకం: వెంకయ్యనాయుడు

ఒంగోలు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్‌ అడ్డంకి అని భాజపా జాతీయ నేత వెంకయ్యనాయుడు అన్నారు. ప్రత్యేక ప్యాకేజి పేరిట కేంద్రం నాటకం అడుతోందని మండిపడ్డారు. భాజపా ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఒంగోలులో అత్మీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి వెంకయ్యనాయుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డితోపాటు పలువురు నాయకులు హాజరయ్యారు. జనాకర్షక విధానాలకు పెద్దపీట వేసి విద్యుత్తు ఉత్పత్తి గురించి పట్టించుకోకపోవడం వల్ల రాష్ట్రంలో పరిశ్రమలు మూతపడుతున్నాయని వెంకయ్యనాయుడు అందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు ఇంతకు ముందు ఉన్న సీఎంలు వైఎస్‌, చంద్రబాబు వల్లే ఈ పరిస్థితి దాపురించిందని అరోపించారు. భాజపా అధికారంలోకి రావాలని, నరేంద్రమోడీ నాయకుడు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. రాజకీయాల్లో కావాల్సింది వారసత్వం కాదు…. జవసత్వం అని కిషన్‌రెడ్డి అన్నారు. జులై 27న హైదరాబాద్‌కు నరేంద్రమోడీ రానున్నారని తెలిపారు. నవభారత యువ సమ్మేళనం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *