Tuesday, 3 November 2026

ప్రత్యేక ప్రవేశ దర్శనం నిలిపివేసిన టీటీడీ

తిరుమల,(జనంసాక్షి): తిరుమల గిరులు భక్తులతో పోటెత్తాయి. వేసవి సెలవులు పూర్తి కావడంతోపాటు, వారంతం కావటంతో స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. నడకదారి మార్గంలో  ఇప్పటికే 18 వేల టోకెన్టను టీటీడీపీ జారీ చేసింది. వెంకన్న సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ కారణంగా ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని టీటీడీ నిలిపివేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *