ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దంపతులు శృంగేరికి బయల్దేరి వెళ్లారు. ప్రత్యేక విమానంలో బయల్దేరిన సీఎం కేసీఆర్ దపంతులు మంగళూరుకు చేరుకుంటారు. అటు నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు శృంగేరి చేరుకుంటారు. మఠాధిపతి భారతీతీర్థస్వామి ఆశీర్వాదం తీసుకుంటారు. అయుత చండీయాగానికి రావాలని ఆహ్వానిస్తారు. సీఎం కేసీఆర్ తనవెంట కొందరు వేద పండితులను కూడా తీసుకెళ్లారు. శృంగేరి మఠంలో గతంలో భారతీతీర్థస్వామి అయుత చండీ మహా యాగం నిర్వహించిన నేపథ్యంలో.. ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన యాగ నిర్వహణపై మఠాధిపతి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. మఠాధిపతికి యాగం నిర్వహణ ఏర్పాట్లను సీఎం కేసీఆర్ వివరిస్తారు. తిరిగి సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు.
ప్రత్యేక విమానంలో బయల్దేరిన సీఎం కేసీఆర్ దపంతులు




