హైదరాబాద్, సెప్టెంబర్ 28 : ప్రపంచానికి భారత్ ఓ ఆశాద్వీపంలో కనిపిస్తోందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో కేంద్రం ఏర్పాటు చేస్తామని గూగుల్ చెప్పిందని వెంకయ్య వివరించారు. 5లక్షల గ్రామాల్లో తక్కువ ఖర్చుతో బ్రాడ్ బ్యాండ్ ఏర్పాటు చేసేందుకు మైక్రోసాఫ్ట్ ముందుకొచ్చిందని తెలిపారు. పది భారతీయ భాషల్లో ఆండ్రాయిడ్ సేవలు అందిస్తామని గూగుల్ ప్రకటించిందన్నారు.పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచం భారత్ వైపు చూస్తోందని…అమెరికా పెట్టుపెట్టుడులు సైతం భారత్‌లో పెద్ద ఎత్తున పెరిగాయన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేశం శక్తివంతం అయ్యేందుకు అందరి సహకారం అవసరమన్నారు. అనేక సంస్కరణలకు సంబంధించిన చట్టాలు పార్లమెంటు ముందు పెండింగ్‌లో ఉన్నాయని వాటి ఆమోదానికి ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. దేశ అభివృద్ధిలో నిర్మాణాత్మాక పాత్రను నిర్వర్తించాలని వెంకయ్య అన్నారు.ప్రపంచానికి భారత్ ఓ ఆశాద్వీపం :వెంకయ్యనాయుడు
హైదరాబాద్, సెప్టెంబర్ 28 : ప్రపంచానికి భారత్ ఓ ఆశాద్వీపంలో కనిపిస్తోందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో కేంద్రం ఏర్పాటు చేస్తామని గూగుల్ చెప్పిందని వెంకయ్య వివరించారు. 5లక్షల గ్రామాల్లో తక్కువ ఖర్చుతో బ్రాడ్ బ్యాండ్ ఏర్పాటు చేసేందుకు మైక్రోసాఫ్ట్ ముందుకొచ్చిందని తెలిపారు. పది భారతీయ భాషల్లో ఆండ్రాయిడ్ సేవలు అందిస్తామని గూగుల్ ప్రకటించిందన్నారు.పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచం భారత్ వైపు చూస్తోందని…అమెరికా పెట్టుపెట్టుడులు సైతం భారత్‌లో పెద్ద ఎత్తున పెరిగాయన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేశం శక్తివంతం అయ్యేందుకు అందరి సహకారం అవసరమన్నారు. అనేక సంస్కరణలకు సంబంధించిన చట్టాలు పార్లమెంటు ముందు పెండింగ్‌లో ఉన్నాయని వాటి ఆమోదానికి ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. దేశ అభివృద్ధిలో నిర్మాణాత్మాక పాత్రను నిర్వర్తించాలని వెంకయ్య అన్నారు.



