Tuesday, 3 November 2026

విశాఖ : రాంకీ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం…ఇద్దరు మృతి

విశాఖపట్నం ,  నగరంలోని రాంకీ ఫార్మాసిటీలో సోమవారం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. సాయినాథ్‌ కెమికల్స్‌ అనే ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో భారీ ఎత్తున మంటలు చేలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతి చెందిన కార్మికులను హేమంత్‌కుమార్, శ్రీనివాస్‌గా గుర్తించారు. మరో ఇద్దరు కార్మికులకు కూడా గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *