Wednesday, 4 November 2026

ప్రపంచ దేశాలన్నీ భారత్‌వైపే

5

ఇండియాలో పెట్టుబడులు పెట్టండి

తయారీ కేంద్రంగా భారత్‌..ప్రధాని నరేంద్ర మోడీ

హానోవర్‌,ఏప్రిల్‌13(జనంసాక్షి): భారతదేశం తయారీ రంగ కేంద్రంగా మారుతోందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ప్రపంచ దేశాలన్నీ భారత్‌వైపు చూస్తున్నాయి. భారత్‌తో పెట్టుబడులు పెట్టేందుకు అందరినీ ఆహ్వానిస్తున్నా. ఇందుకోసం జర్మనీతోపాటు ప్రపంచదేశాలు ముందుకురావాలని మోడీ  కోరారు.  జర్మనీలోని హన్నోవర్‌ పర్యటనలో భాగంగా ఆయన అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో భారతీయ స్టాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ మమ్మల్ని భాగస్వాములుగా ఎంచుకున్న జర్మనీకి కృతజ్ఞతలని, అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో భారత్‌ పాల్గొందన్నారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో ఆయనతోపాటు జర్మన్‌ ఛాన్సలర్‌ ఎంజెలా మార్కెల్‌ పాల్గొన్నారు.  అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ… భారత్‌ తయారీ రంగ కేంద్రంగా మారుతోందన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పారు. భారత్‌తో భాగస్వామ్యానికి జర్మనీ, ప్రపంచ దేశాలు మందుకు రావాలని కోరారు. తక్కువ ఉత్పత్తి ఖర్చు, సమర్థ పాలన, లోప రహిత పర్యావరణ హిత ఉత్పత్తికి అవకాశం ఉండటం… భారత్‌ను పప్రంచ ఉత్పత్తి కేంద్రంగా ఎదిగేందుకు శకిస్తాయన్నారు. అలాగే భారత ప్రధాని నరేంద్రమోడీ జర్మనీలో బిజీబిజీగా గడుపుతున్నారు. హనోవర్‌లో గాంధీ విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించారు. హనోవర్‌లో జర్మన్‌ చాన్స్‌ లర్‌ యాంజెలా మెర్కెలాతో భేటీ అయ్యారు. అనంతరం కేపిటల్‌ గూడ్స్‌ అండ్‌ టెక్నాలజిలో పేరొందిన హనోవర్‌ ఫెయిర్‌ను మోడీ ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో వంద దేశాల నుంచి దాదాపు ఆరు వేల మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. జర్మనీలో ప్రవాస భారతీయులను మోడీ కలుసుకున్నారు. పలువురితో సెల్ఫీలు దిగారు. అనంతరం పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రవాణిజ్యశౄఖ మంత్రి నిర్మలా సీతారామ్‌ కూడా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *