Monday, 2 November 2026

ప్రపంచ బెస్ట్‌ చెఫ్‌ అనుమానాస్పద మృతి

 
1tv82q4t
స్విట్జర్లాండ్‌: ప్రపంచంలోనే ఉత్తమ చెఫ్‌గా గుర్తింపు పొందిన ప్రఖ్యాత చెఫ్‌ బెనోయిట్‌ వైయోలైర్‌(స్విట్జర్లాండ్‌) అనుమానాస్పద స్థితిలో ఈ రోజు మృతి చెందారు. అపార్ట్‌మెంట్‌లో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నామని పేర్కొన్నారు.

స్విట్జర్లాండ్‌లోని లాసాన్నే నగర సమీపంలోని క్రిస్సీయర్‌ ప్రాంతంలో డెల్‌హోటల్‌ డీ విల్లే ‘ఫ్రాన్స్‌ లా లిస్టే’ (త్రీస్టార్‌ హోటల్‌) ర్యాంకింగ్స్‌లో ప్రపంచ ఉత్తమ వెయ్యి హోటళ్లలో మొదటి స్థానంలో నిలిచింది. దీంతో హోటల్‌ చెఫ్‌ అయిన బెనోయిట్‌ ప్రపంచ ఉత్తమ చెఫ్‌గా ఎంపిక అయినట్టు గత డిసెంబర్‌లో హోటల్‌ వెల్లడించింది.

ఫ్రాన్స్‌లో జన్మించిన బెనోయిట్‌ 1996 నుంచి డీ విల్లే హోటల్‌లో చెఫ్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన హఠాన్మరణంతో లాసాన్నే ప్రాంతంలో విషాదం అలుముకుంది. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *