Tuesday, 3 November 2026

ప్రపంచ మార్కెట్‌లో తగ్గిన పెట్రోల్‌ ధరలు

5
వినియోగదారుల ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం

ఎక్సైజ్‌ సుంకం పెంపు

స్వల్పంగా తగ్గిన పెట్రో ధరలు

దిల్లీ, జనవరి 16, (జనంసాక్షి): పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పతనమవడంతో ప్రభుత్వరంగ చమురు సంస్థలు పెట్రోల్‌పై లీటర్‌కు రూ. 2.42 చొప్పున, డీజిల్‌పై లీటర్‌కు రూ. 2.25 చొప్పున ధరలను తగ్గించాయి. తగ్గిన ధరలు శుక్రవారం అర్థరాత్రి నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. పెట్రోల్‌ ధరలు ఆగష్టు నుంచి వరుసగా 9 సార్లు తగ్గాయి. అక్టోబర్‌ నుంచి 5 సార్లు డీజిల్‌ ధరలు తగ్గాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 65 దిగువన, లీటర్‌ ధర డీజిల్‌ రూ. 53 దిగువకు రానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర బ్యారల్‌ కు 46 డాలర్ల కంటే దిగువ స్థాయికి పడిపోయింది. ఒకప్పుడు ఇది 100 డాలర్ల కంటే కూడా ఎక్కువగా ఉండేది. క్రూడ్‌ ధరల పతనంతో భారత్‌ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు కాస్త ఊరట లభించింది.

అయితే  పెట్రోల్‌, డీజిల్‌ పై ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం పెట్రోల్‌, డీజిల్‌ పై లీటరకు రూ.2 సుంకాన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది.  ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు పెట్రోల్‌, డీజిల్‌లపై ఎక్సైజ్‌ సుంకాన్ని నాలుగు సార్లు పెంచారు. ఎక్సైజ్‌ సుంకం పెంపు ద్వారా లీటర్‌ పెట్రోల్‌ పై రూ.7.75 , లీటర్‌ డీజిల్‌ పై రూ 6.50 వినియోగదారులకు భారం పడనుంది. నవంబర్‌ నుంచి 4 సార్లు ఎక్సైజ్‌ సుంకం పెంపు ద్వారా ఖజానాకు రూ.20 వేల కోట్ల ఆదాయం చేకూరుతుంది. ఇదిలా ఉండగా కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం మరోసారి పెంచింది. పెట్రోల్‌, డీజిల్‌పై రూ.2 పెంచుతూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *