అనంతపురం(జనంసాక్షి): ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్‌లో డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కే. పార్థసారధి అనంతపురంలో వెల్లడిరచారు. శనివారం అనంతపురంలో జరిగిన మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి వర్ధంతి వేడుకల్లో పార్ధసారధితో పాటు శైలజానాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పార్ధసారథి విలేకర్ల సమాలేశంలో ప్రసంగించారు.
ఫీజుల నియత్రణలో ప్రైవేట్ పాఠశాలలతో కుమ్మక్కు కావాల్సిన అవసరం తమకు లేదని తెలిపారు. తనపై నమోదు అయిన ఫెమా కేసు వల్ల ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగలేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఈ కేసులో కోర్టు తీర్పుకు శిరసావహిస్తానని చెప్పారు. అయితే తాను రాజకీయాల్లోకి రాక ముందే ఫెమా కేసు నమోదైన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తన వ్యక్తిగత వ్యాపారాల్లో సాంకేతిక లోపం వల్లే ఇది జరిగిందని పార్థసాథి తెలిపారు.




