కడప: ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ పదవికి మేడా మల్లికార్జునరెడ్డి రాజీనామా చేశారు. కడప ఒంటిమిట్టలో జరిగిన రాములోరి కల్యాణ వేడుకల్లో అధికారులు తనను అవమానించారని ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి ఆరోపించారు. దేవాలయ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన తన భార్య, పిల్లలను కూడా అనుమంతించలేదని ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.




