– సీఎంతో సంస్థ ఎండీ భేటి
హైదరాబాద్ అక్టోబర్30(జనంసాక్షి):
ప్రాక్టర్ అండ్ గాంబుల్ ఇండియా ఎండీ ఏఐ రజ్వానీ బృందం ఇవాళ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును కలిసింది. ఈ సందర్భంగా రజ్వానీ మాట్లాడుతూ.. తమ ప్రాక్టర్ అండ్ గాంబుల్ ఇండియా సంస్థ దక్షిణాసియాలో సేవలందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. తెలంగాణలో ప్రాక్టర్ అండ్ గాంబుల్ ప్లానింగ్ సెంటర్ ఏర్పాటుకు సహకరించాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం పెంజర్లలో ఉన్న తమ సంస్థను మరింత విస్తరిస్తామని కేసీఆర్‌కు తెలిపారు. 171 ఎకరాల్లోని తమ సంస్థలో పనిచేస్తోన్న ఉద్యోగుల సంఖ్యను 786 నుంచి 12 వందలకు పెంచుతామని వివరించారు. 80 శాతం ఉద్యోగాలు తెలంగాణ వారికే ఉండేలా చరయలు తీసుకుంటామని తెలిపారు.అనంతరం సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ప్రాక్టర్ అండ్ గాంబుల్ ఇండియా పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుందని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కేజీ టూ పీజీ విద్యనందించే విద్యా సంస్థకు ప్రణాళిక రూపొందించుకోవాలని రజ్వానికి సూచించారు.





