హైదరాబాద్ : కూకట్‌పల్లిలో దారుణం జరిగింది. వరకట్న వేధింపులు తాళలేక…వివాహిత ఆత్మహత్య చేసుకుంది. గుంటూరు జిల్లా కొత్తపాలెం గ్రామానికి చెందిన సుకన్యకు… గుంటూరుకు చెందిన మహేష్‌తో గతేడాది పెళ్లి జరిగింది. గుంటూరులో ఓ ఫైనాన్స్ కంపెనీలో మహేష్ ఉద్యోగం చేస్తుంటాడు. పెళ్లిసమయంలో సుకన్య కుటుంబ సభ్యులు…. 5 లక్షల రూపాయలను కట్నంగా ఇచ్చారు. ఐతే గత మూడు నెలల నుంచి అదనపు కట్నం కోసం భర్త వేధింపులు మొదలుపెట్టాడు. కట్నం తేవాలని తరచూ ఒత్తిడి తేవటంతో…నిజాంపేటలో ఉంటున్న తల్లిదండ్రల దగ్గరకు వచ్చి విషయం చెప్పింది. ఈ తరుణంలోనే…..సుకన్య మనస్తాపంతో బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని చనిపోయింది. ఘటనపై మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రాణం తీసిన కట్నం వేధింపులు




