ప్రెస్ స్టిక్క్రర్లతో అక్రమ దందా
విజయవాడ,జూలై5(జనం సాక్షి ): కృష్ణాజిల్లా నందిగామలో విూడియా ముసుగులో ట్రావెల్స్ దందా జరుగుతోంది. కొంతమంది సొంత రిజిస్టేష్రన్తో కార్లు కొని, కిరాయిలకు తిప్పుతూ, టోల్ గేట్ల వద్ద, బోర్డర్ చెక్ పోస్ట్ ల వద్ద విూడియా పేరు చెప్పుకొని అక్రమంగా గుట్కాలు కూడా రవాణా చేస్తున్నారు. ఆ కార్ల పైప్రెస్ అని ఛానల్ పేర్లు రాసి ఉండటంతో ఆ కార్లను అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. వీరి కార్యకలాపాలు నిరాటంకంగా జరిగిపోతున్నాయి. వీరిపై ఆర్టీఎ అధికారులు, పోలీసులు చర్య తీసుకోవాలని విూడియా కు చెందిన వారు కోరుతున్నారు.