Wednesday, 4 November 2026

ప్రేమోన్మాది ఘాతుకం… ఘర్షణలో హతం

qcz3ljj7యువతి, యువతి తల్లి, బంధువుకు తీవ్రగాయాలు
హైదరాబాద్‌: హైదరాబాద్‌ కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌లో దారుణం జరిగింది. ఓ యువకుడు గొడ్డలితో తాను ప్రేమించిన యువతి ఇంటికి వెళ్లి యువతిపై దాడికి దిగాడు. దీంతో యువతి తల్లిదండ్రులకు-యువకుడికి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఆ ప్రేమోన్మాది యువతి తండ్రి చేతిలో హతమయ్యాడు. వివరాల్లోకి వెళితే… ప్రశాంత్‌నగర్‌లో నివాసముండే సదరు యువతి, రాజు … పద్మావతి నగర్‌లోని ఓ ఫర్నిచర్‌ దుకాణంలో ఏడాది కాలంగా పనిచేస్తున్నారు. ప్రేమించాలంటూ పదే పదే వెంటపడుతున్న రాజు… ఈ తెల్లవారుజామున కొడవలితో తమ ఇంటికి వచ్చాడని, తమ కుమార్తెపై దాడి చేశాడని, అతన్ని అడ్డుకోడానికి ప్రయత్నించిన తమకు గాయాలయ్యాయని యువతి తల్లిదండ్రులు తెలిపారు. తమ కుమార్తెను హత్య చేసేందుకు యత్నించిన యువకుడిని కర్రతో కొట్టి… అతడు తీసుకొచ్చిన కొడవలితోనే అంతమొందించినట్లు యువతి తండ్రి వల్లభరావు అంగీకరించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనలో గాయపడిన యువతిని, యువతి తల్లి, బంధువును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. యువతి తండ్రిని కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

విషమంగా యువతి పరిస్థితి

ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె కూకట్‌పల్లిలోని రెమెడీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *