హైదరాబాద్,జూన్15(జనంసాక్షి): రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులపై కఠిన చట్టాలు లేకపోవడం, వాటిపై చర్యలు తీసుకోకపోవడం వల్ల పార్టీ మారే వారికి అనర్హతకు గురవుతామన్న భయం లేకుండా పోతోంది. ఈ బరితెగింపు గతంలో టిడిపి, ఆ తరవాత వైఎస్ హయాంలో బలంగా సాగింది. ఇష్టం వచ్చినట్లుగా ఇతర పార్టీవాళ్లను చేర్చుకుని తమకు ఎదరు లేదన్నట్లుగా వ్యవహరించారు. ప్రధానంగా వైఎస్ ఈ విషయంలో దూకుడుగా వ్యవహరించి చేరికలను అపహాస్యం చేశారు. అందుకే ఇప్పుడు ఇతర పార్టీల వారిని టిఆర్‌ఎస్,టిడిపిలు చేర్చుకున్నా పెద్దగా తప్పుగా అనిపించడం లేదు. అందుకే ఎపి, తెలంగాణల్లో భారీగా వసలలు మొదలయ్యాయి. ఆకర్శ్ కన్నా బలంగా చేరికలు సాగుతున్నాయి. ఎందుకంటే గతంలో టిఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేలను వైఎస్ చేర్చుకున్న సందర్భంలో ఎవరు కూడా పెద్దగా తప్పుపట్టి విమర్శించలేదు. నాటి కాంగ్రెఎస్ నేతలు ఇవాళ విమర్శించినా ప్రజలు పట్టించుకోకపోవడానికి కారణం కూడా ఇదే. అలాగే ఆంధ్రాలో కూడా టిడిపి వైకాపా నుంచి వలసలను ప్రోత్సహించింది. దీనినిఎవరు కూడా పెద్దగా ఖండిచండం లేదు. అందుకే తెలంగాణలో టిడిపి ఎమ్మెల్యేల వలసలపై పెద్దగా విమర్శలు రావడం లేదు. అధికార రాజకీయాలలో టిడిపి,టిఆర్‌ఎస్ లు పోటాపోటీగా ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలకు పాల్పడుతున్న మాట నిజం. గతంలో కాంగ్రెస్ హయాంలో జరిగాయి. అప్పుడు వీటిపై గొంతెత్తి అరిచిన ఈ పార్టీల పెద్దలు తాము అధికారంలోకి రాగానే అదే బాట పట్టారు. పోని పార్టీలో చేరినవారితో రాజీనామా చేయిస్తే విమర్శలు వచ్చేవి కాదు. అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్న వారు ఎదుటివారికి మాత్రం నీతుల చెబుతున్నారు. పదవులు లేకుంటే చేరికలు కూడా ఉండేవి కావు. ఎంపిలు, ఎమ్మెల్యేలు కాకుంటే చేరికలకు పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదు. ఫిరాయింపుల చరిత్రలోకి వెళితే కడుపు చించుకుంటే కాళ్ల విూద పడుతుందన్న చందంగా అన్ని పార్టీల చరిత్ర ఉంది. ఎన్నికల సమయంలో వందల కోట్లను గుట్టు చప్పుడు కాకుండా పంచే రాజకీయపార్టీలు గెలిచిన వారిని గంపగుత్తగా పార్టీలో చేర్చుకుంటున్నారు. వైకాపా అయితే ఒక్కో ఎమ్మెల్యేకు 20కోట్‌ంలపైనే ఇచ్చి కొంటున్నారని చేస్తున్న విమర్శ ప్రధాన అంశంగా మారింది. తాజాగా కాంగ్రెస్ ఎంపి, ఎమ్మెల్యేలు జారుకోవడంతో కాంగ్రెస్ నేతలు గగ్గోలు పెడుతున్నారు. జారెడ్డి ఓ అడుగు ముందుకు వేసి తెలంగాణ ఉద్యమానికి భిన్నంగా సాగుతోందన్న ఆందోళన వ్యక్తం చేశారు. రాద్దాంతం చేస్తున్నారు గతంలో జరిగిన ఫిరియింపులకు సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. కెసిఆర్ ఈ ఫిరాయింపుల విషయంలో అడ్డదిడ్డంగా వ్యవహరించిన ఎందుకు చర్య తీసుకోవడం లేదని అంటున్నారు. ప్రభుత్వపరంగా ఆఫర్లు ఇచ్చినా అది అవినీతి కిందకు రాదా అని ప్రశ్నిస్తున్నారు. అయితే తెలంగాణలో ఒకలా ఆంద్రాలో మరో రకంగా టిడిపి వ్యవహరించడం వల్లనే పెద్దగా దాని వాదనకు బలం చేకూరడం లేదు. ఎపి శాసనమండలిలో పదిమందికిపైగానే ఇతర పార్టీల ఎమ్మెల్సీలను తనవైపు ఆకర్షించుకుంది. అలాగే 18మంది వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎంపిలకు టిడిపి కండువాలు కప్పింది. ఫిరాయింపు రాజకీయాలకు చెక్ పడితే అవినీతికి తావుండదు. కానీ ఇప్పుడుకేంద్రం కూడా ఫిరాయింపులపై పెద్దగా పట్టించుకోవడం లేదు. అందుకే ఎపిలో వైకాపా నేతుల టిడిపలోకి, ఇతరపార్టీలకు చెందిన వారు తెలంగాణలో టిఆర్‌ఎస్‌లోకి చేరుతున్నారు. మొత్తంగా విపక్షాన్ని బలహీన పర్చాలన్న లక్ష్యంతోనే ఈ రెండు రాష్టాల్ల్రో పావులు కదుపుతున్నారు. చంద్రబాబు కూడా స్థానిక సంస్థల్లో బలం పెంచుకోవడంతో పాటు జగన్‌ను దెబ్బతీసేందుకు వెనకాడడం లేదు. ఎందుకుంటే గతంలో వైఎస్ దెబ్బతీసిన తీరును బాబు అప్పుడే మరచిపోరు. అలాగే జగన్ పార్టీ కూడా టిడిపిని దెబ్బతీసిన ఘటనలు ఉన్నాయి. నంద్యాల ఎంపీగా గెలిచిన ఎస్పీవైరెడ్డి సైతం ఇదే సూత్రం అధారంగా తొలుత స్థానం మారారు. మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీని పక్కనపెడితే రెండే పక్షాలున్నాయి. మొత్తం 175 మంది సభ్యులున్న సభలో 65 మందితో వైసీపీ బలమైన ప్రతిపక్షంగా ఉంది. అధికారానికి దూరంగా ఉన్నప్పుడు తనను దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు అంతే స్థాయిలో దెబ్బతీయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు మొదలు పెట్టారు. తన పార్టీని మరింత పటిష్ఠం చేసుకోవలసిన అవసరం చంద్రబాబు నాయుడికి ఏర్పడింది. మరోవైపు తమ నాయకుడు జగన్‌పై విచారణలో ఉన్న అవినీతి కేసుల పరిస్థితి ఏమవుతుందోనన్న ఆందోళన పార్టీ నేతల్లో ఉంది. దీంతో ఆయన జైలుకు వెళ్లే పరిస్తితి వస్తే ఎలా అన్నది కూడా ఆ పార్టీలో ఉన్నవారిని వేధిస్తోంది. అందుకే దీపం ఉండగానే ఇల్లుచక్కబెట్టుకోవాలన్న ఆలోచన ఆలామిందికి కలుగుతోంది. అందుకే ఆకర్షక్ పథకం పనిచేస్తోంది.
ఫిరాయింపు రాజకీయాలతో విపక్ష పార్టీల చిత్తు




