
హైదరాబాద్,అక్టోబర్ 27(జనంసాక్షి): విద్యార్థులకు బోధనా రుసుములు చెల్లింపులో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కాంగ్రెస్ నేతలు విరుచుకుపడ్డారు. రెండున్నరేళ్లుగా ఫీజురియంబర్స్‌మెంట్ విసయంలో ప్రభుత్వానికి స్పస్టత లేకుండా పోయిందన్నారు. హైదరాబాద్ దిలుసుక్‌నగర్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్ సాధనకోసం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థి గర్జన సభలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. విద్యార్థుల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ప్రతిపక్షనేత జానారెడ్డి తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మోసం చేస్తున్న ప్రభుత్వానికి విద్యార్థులు గుణపాఠం చెప్పాలని జానారెడ్డి సూచించారు. కాంగ్రెస్ దీనికోసం నిలదీస్తుందని అన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ సమస్యల వలయంలోకి నెట్టారని ఆరోపించారు. ఎన్నికల్లో తెరాస ఇచ్చిన హావిూలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని పేర్కొన్నారు. ఇచ్చిన హావిూలను మరచిపోతుఎన్నారని, త్యాగాలు చేసిన విద్యార్థులనే తప్పిస్తున్నారని అన్నారు. పేదవారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వరు కానీ, కేసీఆర్‌కు 9 ఎకరాల్లో భవనం కావాలా అని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ప్రశ్నించారు. విద్యార్థుల సమస్యలపై పోరాడేందుకు కాంగ్రెస సిద్దంగా ఉందని అన్నారు. కేసీఆర్ విద్యార్థులను శత్రువులుగా చూస్తున్నారని, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. విద్యార్థులతో పెట్టుకుంటే మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. వాస్తు పేరుతో సచివాలయాన్ని కూల్చుతామనడం సరికాదని ఆయన అన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు సీనియర్ నేతలు కొప్పుల రాజు, షబ్బీర్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, వంశీచందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్ధి పోరు గర్జన నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ..విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని లేకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొప్పుల రాజు, ఎమ్మెల్యేలు జానారెడ్డి, వంశీచంద్ రెడ్డి, ఎంఎల్‌సీ షబ్బీర్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, సుధీర్‌రెడ్డి, బిక్షపతి యాదవ్, కార్తీక్ రెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ హయాంలో ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకంతో లక్షలాది పేద విద్యార్థులు లబ్ది పొందారని నర్పంపేట ఎమ్మెల్యే, జి/-లలా కాంగ్రెస్ అధ్యక్షుడు దొంతు మాదవరెడ్డి అన్నారు. అయితే ప్రస్తతు ప్రభుత్వం విద్యార్థులు, విద్యావ్యవస్థను చిన్నచూపు చూస్తోందని ఆయన ఆరోపించారు. ఫీజు బకాయిలు ఉపకార వేతనాలు, ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ముఖ్యమంత్రి కేవలం తనకు అవసరమైన నూతన సచివాలయం, క్యాంపు కార్యాలయాల నిర్మాణాల పేరిట కోట్లాది రూపాయలు వృధా చేస్తున్నారని అన్నారు. అవసరమైన వాటికి నిధులు కేటాయించడంలో మాత్రం ఆలోచిస్తున్నారని విమర్శించారు. తెరాస నేతలకు పదవులపై ఉన్న శ్రద్ధ ప్రజాసంక్షేమంపై లేదన్నారు. సమస్యలను అధికార పార్టీ నేతలు ఎందుకు సిఎం దృష్టికి తీసుకుని వెల్లరని ప్రశ్నించారు. కెసిఆర్ కూడా ప్రజల నుంచి సమాచారం తెప్పించుకోవాలన్నారు.




