– 20నెలల పాలన అద్భుతం
– ‘మహా’ఒప్పందం చారిత్రాత్మకం
– రూ.1.15 లక్షల కోట్ల వార్షికబడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాం
– ఉభయసభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగం
హైదరాబాద్,మార్చి10(జనంసాక్షి): తెలంగాణ ఆకాంక్షలకు అద్దంపట్టే విధంగా అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలతో ప్రభుత్వం పనిచేస్తోందని గవర్నర్ నసింహన్ చెప్పారు. తెలంగాణ ఆవిర్భావం తరవాత గత 20 నెలల పాలన కాలంలో దీనిని సాకారం చేసి చూపామన్నారు. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. అంతర్రాష్ట్ర సమస్యలు విజయవంతంగా పరిష్కరించుకుని గోదావరి జలాలను వాడుకునే విషయంలో మహారాష్ట్రతో సామరస్యపూర్వక వాతావరణంలో ఒప్పందం కుదురుర్చు కున్నామని ప్రత్యేకరంగా ప్రస్తా వించారు. రాజనీతిజ్ఞతతో మా ప్రభుత్వం వ్యవహరించిందని అన్నారు. తెలంగాణ నవ రాష్ట్రం. లోతుగా కసరత్తు చేసి ఈసారి బడ్జెట్ రూపకల్పన చేస్తోందన్నారు. గత 21 నెలల్లో ప్రాథమ్యాలను గుర్తించాం. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం చేపట్టాం అన్నారు. ఎన్నో ఆశల మధ్య తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని గవర్నర్ నరసింహన్ అన్నారు.ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేపట్టి అభివృద్ధి పథంలో దూసుకెళుతోందని అన్నారు. తాజాగా గోదావరి నదిపై ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్రతో తెలంగాణ చరిత్రాత్మక ఒప్పందం చేసుకుందని అన్నారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ముఖ్యంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ప్రాజెక్టులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. డబుల్ బెడ్ రూం, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ వంటి గొప్ప పథకాలు అమలు చేస్తుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపట్ల జాతీయ స్థాయిలో కూడా ఆసక్తి చూపుతోందని అన్నారు. హైదరాబాద్‌లో 4 కొత్త సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుచేయడం జరుగుతుందన్నారు. శిశు మరణాల రేటు తగ్గింపునకు కృషి చేస్తోందని అన్నారు. రూ.1.15లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టడమే గాకుండా, అన్ని రంగాల్లో రాష్ట్రం ప్రగతి సాధిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రాథమ్యాలకు అనుగుణంగా పలు పథకాలు ప్రవేశపెట్టామన్నారు. కల్యాణలక్ష్మి పథకం వెనుకబడ్డ అన్ని వర్గాలకు కూడా విస్తరిస్తున్నామని అన్నారు. గర్భిణిల కోసం ఆరోగ్యలక్ష్మి పథకం, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్దీకరణ హావిూ నెరవేర్చే పక్రియ ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు. మానవీయ కోణంలో ఆహార భద్రత కల్పిస్తున్నాం అన్నారు.
పంచాయతీల స్థాయిలో పాలన సంస్కరణలు తీసుకుని వచ్చామన్నారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా ప్రభావవంతంగా స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించామన్నారు. 41 లక్షల ప్లాస్టిక్ చెత్తబుట్టలు ప్రజలకు పంపిణీ చేశాం. వ్యవసాయ రంగంలో పలు సంస్కరణలు తీసుకొచ్చాం. అందరికీ అందుబాటులో వైద్యం, ప్రస్తుత ఆరోగ్య వ్యవస్థను పటిష్ఠం చేస్తాం. ప్రభుత్వ రంగంలో ఆరోగ్య వ్యవస్థను బలపరుస్తాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో విప్లవాత్మక మార్పులు తెస్తున్నాం. హైదరాబాద్‌లో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కొత్తగా నిర్మిస్తున్నామని అన్నారు. అలాగే 108 వాహనాలకు జవసత్వాలు కల్పించి బలోపేతం చేస్తాం అని అన్నారు. మిషన్ ఇంద్రధనస్సులో రాష్ట్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తామన్నారు. ఉద్యాన పంటల సేకరణ, గిడ్డంగుల సదుపాయం కోసం ప్రత్యేక నిధులు విత్తన భాండాగారంగా తెలంగాణ అభివృద్ది చెందుతోందన్నారు. 45వేల చెరువుల పునరుద్ధరణకు మిషన్ కాకతీయ. మిషన్ భగీరథ పేరుతో ఇంటింటికీ తాగునీరు ఇచ్చే పథకం చేపట్టాం. గ్రావిూణ, పట్టణ ప్రాంతాల దాహర్తి తీర్చేందుకు ప్రతిష్ఠాత్మకంగా మిషన్ భగీరథ చేపట్టాం. అంతరాయం లేని, నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం ప్రభుత్వం సాధించిన విజయంగా చెప్పుకొచ్చారు. సౌర విద్యుత్‌కు రానున్న మూడేళ్లలో భారీగా ప్రోత్సాహం కల్పించనున్నట్లు వెల్లడించారు. పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన ప్రభుత్వ పాథమ్యాల్లో కీలకంగా ఉందన్నారు. వ్యవసాయానికి రోజుకు 9గంటల ఉచిత విద్యుత్, కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే లక్ష్యంగా చెప్పారు. టీఎస్ ఐపాస్ తో రాష్ట్రానికి కి భారీగా పరిశ్రమలు వస్తున్నాయని, సింగిల్ విండోతో వేగంగా పరిశ్రమలకు అనుమతులు.. ఏర్పాటు జరుగుతోందన్నారు. కొత్త విద్యుత్ ప్రాజెక్టులకు భూసేకరణ పూర్తి చేస్తున్నామని అన్నారు. గచ్చిబౌలిలో టీహబ్‌తో యువతకు లబ్ధి కలుగుతోందన్నారు. రాష్ట్రంలో 11.7శాతం వృద్ధి రేటు నమోదు కావడం అభివృద్దికి నిదర్శనంగా చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రజల ఆశలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందని, విద్యుత్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. సంక్షేమ హాస్టళ్లకు సన్నబియ్యం ఇచ్చినట్లుగానే కాలేజీలకు కూడా సరఫరా చేస్తున్నామని అన్నారు. టెక్స్ టైల్ హబ్ గా వరంగల్ అభివృద్ధి చే/-తామని అన్నారు. అన్ని జిల్లా కేంద్రాలకు నాలుగు లేన్ల రోడ్ల ఏర్పాటు చేయడం, షీ టీమ్స్ తో ఈవ్ టీజింగ్ కు కళ్లెం… మొత్తంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందన్నారు. పబ్లిక్ హెల్త్‌కేర్ సెక్టార్‌లో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని అధ్యయనం కోసం శ్రీలంకు ప్రత్యేక బృందాన్ని పంపించామని వెల్లడించారు. శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గించామన్నారు. స్వచ్చ్ భారత్ కోసం రూ.200 కోట్లు కేటాయించామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్నామని వివరించారు. 108 వాహనాలకు జవసత్వాలు కల్పించి బలోపేతం చేస్తున్నామన్నారు. రూ.1.15 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నట్టు వెల్లడించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలను ప్రవేశపెట్టామని తెలిపారు. నిరుపేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల వంటి పథకాలతో ప్రభుత్వం అభివృద్ధికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. మైనారిటీల కోసం 17 రెసిడెన్షియల్ స్కూల్లు నిర్మిస్తున్నామని తెలిపారు.





