బంగారు తెలంగాణ సాధించడం ఖాయం – తుమ్మల..

ఖమ్మం : బంగారు తెలంగాణ సాధించడం ఖాయమని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. జిల్లాలోని ఏన్కూర్‌లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ కలలుగన్న బంగారు తెలంగాణ సాధనలో ప్రతిఒక్కరం భాగస్వాములు కావాలని, బంగారు తెలంగాణను సాధిద్దామని పిలుపునిచ్చారు.