బకాయి వేతనాలు చెల్లించాలి
శ్రీకాకుళం,మే7(జనం సాక్షి):వలంటీర్లుగా పనిచేసిన తమకు బకాయిపడ్డ వేతనాలు చెల్లించాలని పలువురు వలంటీర్లు గిరిజన దర్బార్‌లో అధికారులను కోరారు. సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకులు సీతారామయ్య ఆధ్వర్యంలో గిరిజన దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన గిరిజనులు హాజరై తమ వ్యక్తిగత, గ్రామ సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. దర్బార్‌లో డిప్యూటీ డీఈవో రామ్మోహన్‌రావు, ఏపీడీలు డైజీ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.