– గ్రామీణ ప్రజలు, వ్యవసాయ రంగానికి పెద్దపీట
– ఆర్గానిక్ వ్యవసాయానికి ప్రోత్సాహం
– రహదారుల అభవృద్దికి భారీగా కేటాయింపులు
– ఉద్యోగావకాశాలకు పెద్దపీట
– 2016-17 సాధారణ బడ్జెట్‌ను సమర్పించిన కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ
– బడ్జెట్‌కు ఈసారి తొమ్మిది లక్ష్యాలు ఉన్నాయని వెల్లడి
పెరిగేవి….
కార్లు
సిగరెట్లు, పొగాకు, కాగితం బీడీలు, గుట్కా
రెస్టారెంట్లలో భోజనాలు, విమాన ప్రయాణం
రూ.వెయ్యి పైబడిన రెడీమేడ్ గార్మెంట్స్, బ్రాండెడ్ వస్తువులు
వెండి మినహా బంగారం, ఇతర అభరణాలు
దిగుమతి చేసుకునే ఆభరణాలు
మినరల్ వాటర్
రూ.2లక్షల పై బడిన వస్తు రవాణా
అల్యూమినీయం
ప్లాస్టిక్ బ్యాగులు, సాక్స్‌లు
రోప్ వే, కేబుల్ కారు ప్రయాణాలు
పరిశ్రమల్లో వాడే సోలార్ వాటర్ హీటర్స్
లీగల్ సర్వీసులు
లాటరీ టిక్కెట్లు
ప్రైవేటు అద్దె వాహనాల్లో ప్రయాణం
ఈ-రీడింగ్ డివైస్‌లు
వాయిస్ ఓవర ఇంటర్నెట్ ప్రోటోకాల్(వీఓఐపీ)
విదేశీ గోల్ఫ్ కార్ట్‌లు
బంగారు కడ్డీలు
తగ్గేవి….
పాద రక్షలు
సోలార్ పంపులు
రోటర్స్, బ్రాడ్ బాండ్ మోడెమ్స్, సెట్ టాప్ బాక్స్‌లు, డిజిటల్ వీడియో, సీసీటీవీ కెమెరాలు
హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్
డయాలసిస్ పరికరాలు
60 చదరపు విూటర్లలో నిర్మించే ఇళ్లు
జానపద కళాకారులకు చెల్లించే మొత్తాలు
రిఫ్రిజిరేటర్ కంటెయినర్స్
పెన్షన్ ప్లాన్స్
మైక్రో వేవ్ ఓవెన్స్
సానిటరీ ప్యాడ్స్
బ్రెయిలీ పేపర్
న్యూఢిల్లీ,ఫిబ్రవరి 29(జనంసాక్షి): కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ సమర్పించిన బడ్జెట్ ప్రణాళికేతర వ్యయం చూస్తే ప్రణాళికా వ్యయాన్ని మింగేలా ఉంది. ఐదున్నర లక్షల కోట్ల ప్రణాళికా వ్యయం కాగా, 14.28 లక్షల కోట్ల మేర ప్రణాళికా వ్యయం పద్దులో చూపారు. 2016-17 సాధారణ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంటులో సోమవారం ప్రవేశపెట్టారు. ప్రణాళికేతర వ్యయాన్ని అదుపుచేసే చర్యలపై జైట్లీ తన ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు. బడ్జెట్ మొత్తంగా 19.28 లక్షల కోట్లుగా చూపారు. గ్రావిూణ, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేయడం బడ్జెట్‌లో ఓ ముఖ్యమైన విషయంగా పరిగణించాలి. ప్రధాని మోడీ ఇటీవల చెప్పినట్లుగా రైతులకు అండగా, ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు పెద్ద మొత్తంలో కార్యక్రమాలను ప్రకటించారు. ప్రభుత్వం కొత్తగా తెస్తున్న ప్రధాని పంటల బీమా యోజన రైతులకు భరోసా ఇవ్వనుంది. గ్రావిూణ, కీలక రంగాలకు అదనపు వనరులు సమకూర్చారు. ప్రజలకు సామాజిక,ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రపంచమంతా ఆర్థిక మందగమనంలో ఉన్న సమయంలో తాను బడ్జెట్ ప్రవేశ పెడుతున్నానని, భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. తాము సవాళ్లను అవకాశాలుగా మలుచుకున్నట్లు జైట్లీ తెలిపారు. ద్రవ్యోల్బణం 9శాతం నుంచి 5.4 శాతానికి తగ్గిందన్నారు. భారత్ 7.6 శాతం వృద్ధిరేటు నమోదు చేసినట్లు వెల్లడించారు. భారత్ వృద్ది రేటు 6.3 శాతం నుంచి 7.1 శాతానికి పెంచగలిగామని, కరెంట్ రెవెన్యూ లోటును తగ్గించామని ఆయన చెప్పారు.350 మిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నాయని ఆయన చెప్పారు. బడ్జెట్‌కు ఈసారి తొమ్మిది లక్ష్యాలు ఉన్నాయని జైట్లి ప్రకటించారు. వాటిలో మొదటిది రైతులు ఆదాయం వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేయడమని ఆయన తెలిపారు.అత్యధిక శాతం భూబూమికి నీటి పారుదల సదుపాయాలు కల్పించడం, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం చేస్తామని ఆయన తెలిపారు. వర్షాధార ప్రాంతాలలో ఆర్గినిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని మంత్రి తెలిపారు.క్రాప్ ఇన్సూరెన్సు పథకం అమలుకు 5,500 కోట్లు కేటాయించామని ఆయన తెలిపారు. వ్యవసాయం,రైతు సంక్షేమానికి 38 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. పశువులకు హెల్త్ కార్డులు ఇస్తామని జైట్లి చెప్పారు. పంచాయతీలకు, మున్సిపాల్టీలకు పెద్ద ఎత్తున నిధులు ఇవ్వబోతున్నట్లు కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లి చెప్పారు. లోక్ సభలో ఆయన బడ్జెట్ ప్రసంగం చేవారు.ఇది గత ఐదేళ్లలో ఉన్న కేటాయింపు కన్నా 228 శాతం అధికమని ఆయన చెప్పారు. గ్రామాలకు ఎనభై లక్షల వరకు,మున్సిపాల్టీలకు ఇరవైఒక్క కోట్ల వరకు నిధులు ఇచ్చే అవకాశం ఉందని,కేంద్ర పంచాయతీ రాజ్‌శాఖకు సంబంధిందించిన మార్గదర్శకాలను రాష్ట్రాలతో సంప్రదించి తయారు చేస్తుందని ఆయన తెలిపారు. పద్నాలుగో ఆర్దిక సంఘం సిఫారస్‌ల ప్రకారం నిధులు కేటాయిస్తున్నామని ఆయన తెలిపారు. దేశంలో విద్యుత్ సదుపాయం లేని గ్రామాలు ఉండరాదని ప్రధాని కోరుతున్నారని, ఆ ప్రకారం నిదులు కేటాయిస్తున్నామని ఆయన చెప్పారు. డిజిటల్ ఇండియా స్కామ్ కింద భూమి రికార్డులను తయారు చేస్తామని అన్నారు. గ్రావిూణాబివృద్దికి 87 వేల కోట్ల రూపాయలు కేటాయించామని జైట్లి తెలిపారు.పేదలకు వంట గ్యాస్ కనెక్షన్ లు ఇస్తామని,ఇందుకోసం రెండువల కోట్లు వ్యయం చేస్తామని ఆయన తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రులలో డయాలిసిస్ యూనిట్ ఏర్పాటు చేయడానికి వీలుగా చర్యలు చేపడుతున్నట్లు ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లి తెలిపారు. లోక్ సభలో ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టారు. జాతీయ డయాలిసిస్ సర్వీస్ ను ప్రవేశపెడతామని, దీని ద్వారా డయాలిసిస్ కిట్ లపై ఎక్సైజ్ డ్యూటీ ,ఇతర పన్నులను మినహాయిస్తామని ఆయన తెలిపారు.ఆరోగ్య స్కీమ్ కింద పేద కుటుంబాలకు లక్ష రూపాయలు, సీనియర్ సిటిజన్లకు అదనంగా మరో ముప్పైవేల రూపాయలు ఇస్తామని ఆయన చెప్పారు.1500 నైపుణ్య శిక్షణ సంస్థలను ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం 1500 కోట్ల బడ్జెట్ ను కేటాయిస్తామని ఆయన చెప్పారు. రైతుల వడ్డీ రాయితీకి పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. మాల్స్ లో మాదిరి షాపులు, దుకాణాలు కూడా వారం రోజులపాటు తెరచి ఉంచడానికి అనుమతి ఇవ్వబోతున్నామని ఆయన చెప్పారు. ఆర్థిక డేటా విశ్లేషణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లుఅరుణ్ జైట్లీ తెలిపారు. లోకసభలో బడ్జెట్ ఆర్ధిక అంశాలపై సమాచారాన్ని సేకరించి, ఆ తర్వాత దాన్ని విశ్లేషించేందుకు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. బీమా కంపెనీలు, బ్యాంకులు దివాళా
తీయకుండా ఉండేందుకు ప్రత్యేక సమగ్ర కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఆహార పదార్థాల్లో వంద శాతం ఎఫ్‌డీఐని ప్రవేశపెట్టనున్నారు. పెట్టుబడుల ఉపసంహరణ శాఖను డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్‌గా పిలువనున్నారు. అణు ఇంధన వినియోగాన్ని పెంచేందుకు మరో 20 ఏళ్లకు తగ్గ సమగ్ర ప్రణాళికను రూపొందించినట్లు ఆయన చెప్పారు. అణు విద్యుత్ ఉత్పత్తికి రూ. 3 వేల కోట్లు కేటాయిస్తున్నామని అరుణ్ జైట్లీ ప్రకటించారు. చమురు నిక్షేపాల వెలికితీతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల రంగానికి కొత్త రేటింగ్ విధానం అమలు చేస్తామన్నారు. తూర్పు, పశ్చిమ తీర ప్రాంతాల్లో కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఓడరేవులు నెలకొల్పుతామన్నారు. జాతీయ సర్వీస్ కెరియర్ ఫ్లాట్‌ఫాంతో రాష్ట్ర ఉపాధి కల్పన కార్యాలయాలను అనుసంధానం చేస్తామని తెలిపారు. మౌలిక సదుపాయాల రంగంలో పన్ను రహిత బాండ్లు జారీ చేస్తామని చెప్పారు. భారత్‌లో తయారైన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో నూరు శాతం ఎఫ్‌డీఐకి అనుమతి ఇస్తామని ఉద్ఘాటించారు.
రోడ్లు, జాతీయ రహదారులు, రైల్వేలకు రూ. 2,21,246 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు. జాతీయ రహదారుల అభివృద్ధిక రూ. 97 వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ప్యాసింజర్ బస్సుల నిర్వహణకు కొత్త ప్రయోగం చేపడుతామన్నారు. రవాణా రంగంలో లైసెన్స్‌రాజ్‌కు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు. ప్యాసింజర్ రవాణా రంగంలో ప్రైవేటు సంస్థలకు పచ్చజెండా. రూ. 150 కోట్లతో అసంపూర్ణంగా ఉన్న విమానాశ్రయాల పునరుద్ధరణ చేపడుతామన్నారు.
వ్యవసాయానికి పెద్దపీట
బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు. మొత్తం రూ.35,984 కోట్లు కేటాయించారు. పశు పోషణకు కొత్తగా 4 పథకాలు అమలు చేయబోతున్నారు. పశువైద్య పరీక్షల కార్డులు, పాల సేకరణకు ప్రోత్సాహం, ఈ-మార్కెటింగ్ సౌకర్యం కల్పన ఇందులో ప్రధానమైనవిగా చెప్పారు. మూడేళ్లలో 5లక్షల ఎకరాలను సేంద్రియ సాగు కిందకు తీసుకు రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. యూనిఫైడ్ అగ్రికల్చర్ ప్లాట్‌ఫామ్‌ను బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజున జాతికి అంకితం చేస్తారు. వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.17.9 లక్షల కోట్లుగా నిర్ధారించారు. తక్కువ ప్రీమియం.. అత్యధిక బీమా రక్షణతో ప్రధానమంత్రి ఫసలీ బీమా యోజన ఏర్పాటును ప్రకటించారు. జంతు ఆరోగ్య కార్డుల అందజేత, జంతువుల మార్కెటింగ్‌ను
ఈ ప్లాట్‌ఫామ్‌కు అనుసంధానించడం ముఖ్యమని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో సాగునీటి కోసం రూ.86,500 కోట్లు వ్యయం చేయనున్నారు. వచ్చే ఐదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్నదే లక్ష్యంగా బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. నగరాలు, పట్టణాల్లో వ్యర్థాల నుంచి సేంద్రియ ఎరువుల తయారీకి కూడా ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. ప్పుల ధరలు పెరిగిపోతున్నక్రమాన్‌ఇన గుర్తించి, పప్పు ధాన్యాల అభివృద్ధికి రూ.500కోట్లు కేటాయించడం విశేషం. గ్రావిూణాభివృద్ధి, ఆరోగ్యం, నైపుణ్యాలు, ఉపాధి, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇచ్చారు. పంటల బీమో పథకం కోసం రూ.5,500 కోట్లు, సేంద్రియ వ్యవసాయానికి రూ.412 కోట్లు కేటాయించారు. ప్రభుత్వం కొత్తగా తెస్తున్న ప్రధాని పంటల బీమా యోజన రైతులకు భరోసా ఇవ్వనుంది.
గ్రావిూణాభివృద్ధికి భారీ కేటాయింపులు
గ్రావిూణ, మున్సిపాల్టీలకు ఈ బడ్జెట్‌లో రూ. 2.87లక్షల కోట్లు కేటాయించారు. ఇది గతంతో పోల్చుకుంటే 228 శాతం అధికం. గ్రామాల్లో సదుపాయల కల్పన, పట్టణీకరణకు వీటిని వినియోగించనున్నారు. గ్రావిూణ అభివృద్ధికి మాత్రమే రూ.87,765 కోట్లు కేటాయించారు. గ్రావిూణ విద్యుదీకరణకు సంబంధించిన
ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ పథకానికి రూ. 38,500 కోట్లు అందజేశారు. మే 2018నాటికి 100 శాతం గ్రావిూణ విద్యుదీకరణను లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రావిూణ విద్యుదీకరణకు రూ.8500 కోట్లు కేటాయించనున్నారు. గ్రామాల్లో డిజిటల్ విద్యావ్యాప్తి కింద వచ్చే మూడేళ్లలో 6కోట్ల గృహాలను డిజిటల్ లిట్రసీ స్కీం పరిధిలోకి తీసుకురానున్నారు.
ఆదాయపన్నులో ఎలాంటి మార్పు లేదు
ఆదాయ పన్నులో ప్రధాన మార్పులేవిూ లేకున్నా కొన్ని వెసలుబాట్లు కల్పించారు. ప్రధానంగా ఆదాయపన్ను పరిమితి పెంచుతారని ఉద్యోగవర్గాలు భావించాయి. రూ.5లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి ఆదాయపు పన్ను రాయితీ 2 వేలనుంచి 5 వేలకు పెంచారు. పన్ను రాయితీ ద్వారా కోటి మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం కలుగుఉతందని జైట్లీ ప్రకటించారు. ఇక 3.5 కోట్ల చౌకధరల దుకాణాల డిజిటలైజేషన్ చేస్తారు. స్టార్టప్ కంపెనీల రిజిస్ట్రేషన్‌కు ఒక్కరోజులోనే అనుమతి ఇచ్చేలా చేస్తారు. అద్దె ఇళ్లల్లో నివాసం ఉండేవారికి అద్దె మినహాయింపు రూ.24వేల నుంచి రూ.60వేలకు పెంచారు. సొంత ఇల్లు లేని, హెచ్‌ఆర్‌ఏ పొందని ఉద్యోగులకు వర్తింపు కూడా ఇదివర్తిస్తుంది. స్టార్టప్‌ల ద్వారా పొందే లాభాలపై మూడేళ్ల పాటు నూరు శాతం పన్ను రాయితీ ఉంటుంది.
రహదారుల అభివృద్ధికి పెద్దపీట
రూ.27వేల కోట్లతో 2.23 లక్షల కి.విూ. ల రహదారుల నిర్మాణం లక్ష్యంగా బడ్జెట్ కేటాయింపులు చేశారు.
ప్రధానమంత్రి గ్రావిూణ సడక్ యోజనకు రూ.19వేల కోట్లు, నాబార్డ్ ద్వారా రూ.20వేల కోట్లతో ఇరిగేషన్ ఫండ్ ఏర్పాటు, 300 రూర్బన్ క్టస్లర్ల ఏర్పాటు వంటివి ఇందులో ప్రధానంగా చెప్పుకోవాలి. గ్రావిూణ విద్యుదీకరణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటారు. స్వచ్ఛభారత్ అభియాన్ కోసం రూ.9వేల కోట్లు కేటాయించారు.
ఆరోగ్య రంగానికి పెద్దపీట
ఆరోగ్య రంగానికి పెద్దపీట వేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష వరకు బీమా కల్పిస్తామని హావిూయిచ్చారు. ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగా పాడైతే కుటుంబ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. ఇందుకోం కొత్త పథకం ప్రవేశపెడుతున్నాం. కుటుంబానికి లక్ష రూపాయలు, సీనియర్ సిటిజన్లకు అదనంగా రూ. 30 వేలు అందజేస్తాం. జెనెరిక్ మందులను అందించేందుకు అదనంగా దుకాణాలు ఏర్పాటుచేయిస్తాం. మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారి కోసం డయాలసిస్ ఖర్చు ఏడాదికి రూ. 3 లక్షలు అవుతోంది. పీపీపీ మోడ్‌లో జాతీయ డయాలసిస్ సర్వీస్ కార్యక్రమం అన్ని జిల్లా ఆస్పత్రులలో ప్రారంభం అవుతుంది. డయాలసిస్ పరికరాల విూద బేసిక్ కస్టమ్స్, ఎక్సైజ్ పన్నులు మినహాయిస్తున్నాం. 300 జనరిక్ జౌషధ దుకాణాలను త్వరలోనే ప్రారంభిస్తాం అని వివరించారు.
జాతీయ ఎస్సీ ఎస్టీ హబ్ ఏర్పాటు
అంబేద్కర్ 125వ జయంతి సంవత్సరం జరుపుకొంటున్న వేళ జాతీయ ఎస్సీ ఎస్టీ హబ్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నట్లు వెల్లడించారు. వెయ్యి కోట్లతో ఉన్నత విద్యా ఫైనాన్సింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్కూళ్లల్లో మార్కుల షీట్లు, టీసీలన్నింటినీ సులభంగా తీసుకోడానికి వీలుగా డిజిటల్ డిపాజిటరీని ఏర్పాటు చేస్తారు. దీన్ దయాళ్ గ్రామజ్యోతి యోజనకు 8500 కోట్లు,
స్వచ్ఛభారత్ మిషన్‌కు 9వేల కోట్లు,రాబోయే మూడేళ్లలో 6 కోట్ల ఇళ్లకు డిజిటల్ అక్షరాస్యత
గ్రావిూణ, కీలక రంగాలకు అదనపు వనరులు సమకూర్చడంపై ప్రధానంగా దృష్టి పెట్టారు. గ్రావిూణాభివృద్ధి, ఆరోగ్యం, నైపుణ్యాలు, ఉపాధి, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం
ఆర్థిక సంస్కరణలు, వ్యాపారానుకూల వాతావరణం, ఆర్థిక క్రమశిక్షణ, పన్ను సంస్కరణలపై దృష్టి సారిస్తామన్నారు. మే 2018నాటికి కరెంటులేని 18,500 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తారు. బహుముఖ నైపుణ్యాల శిక్షణకు దేశవ్యాప్తంగా 5700 పాఠశాలల ఏర్పాటు, కొత్త ఉద్యోగులకు మొదటి మూడేళ్లు 8.33 శాతం ఈపీఎఫ్ ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు.
బడ్జెట్ ప్రాధాన్యాలు…
మొత్తం బడ్జెట్ రూ.19.78లక్షల కోట్లు
ప్రణాళికా వ్యయం రూ.5.5లక్షల కోట్లు
ప్రణాళికేతర వ్యయం రూ.14.28 లక్షలకోట్లు
ద్రవ్యలోటు 3.5 శాతం …. రెవెన్యూ లోటు 2.5శాతం
బ్యాంకుల మూలధన సవిూకరణకు రూ.25వేల కోట్లు
ముద్రా బ్యాంక్ ద్వారా రూ.లక్షా 80 వేల కోట్ల మేర రుణాలు
సెబీ ద్వారా కొత్తగా కమోడిటీ డెరివేటివ్స్ మార్కెట్
గ్యాస్ ఉత్పత్తి సంస్థలకు రాయితీ
ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థిరీకరణకు కార్యాచరణ
పంటల బీమా పథకాలకు గత బడ్జెట్ కంటే నిధులు రెట్టింపు
రూ.900 కోట్లతో పప్పు ధాన్యాలకు మార్కెట్ స్థిరీకరణ నిధి
రోడ్లు, జాతీయ రహదారులపై ప్రణాళికా వ్యయం 28శాతం పెంపు
ఆర్థిక సేవల విషయంలో ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ చట్టం
సాగరమాల ప్రాజెక్టు కోసం రూ.8వేల కోట్లు
వచ్చే మూడేళ్లలో కోటిమందికి నైపుణ్యంలో శిక్షణ
అణు విద్యుత్ కోసం రూ.3వేల కోట్లు
గ్రీన్ ఫీల్డ్ పోర్టుల కోసం రూ. 800 కోట్లు ఖర్చు
డీప్ సీ నుంచి గ్యాస్ తీస్తే ప్రోత్సహాలు
ఉన్నత విద్య చదివేవారికి చేయూత
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక ప్రోత్సహకాలు





