Wednesday, 4 November 2026

బడ్జెట్‌లో తెలుగు రాష్టాల్రకు అన్యాయం :తుమ్మల

ఏలూరు,మార్చి3(జ‌నంసాక్షి): బడ్జెట్‌ కేటాయంపులు, హావిూల అమలులో రెండు తెలుగురాష్టాల్రకు అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇచ్చిన హావిూలను అమలు చేయడంలో కేంద్రం ముందుకు రాలేదన్నారు. కేంద్ర బ్జడెట్‌ విషయంలో తెలుగు రాష్టాల్రకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. రైల్వే అభివృద్ధి విషయంలోనూ బ్జడెట్‌లో నిరాశే ఎదురయిందన్నారు. తెలుగువారు ఎక్కడున్నా కలిసిమెలసి ఉండాలన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని గురవాయిగూడెంలోని మద్ది ఆంజనేయ స్వామివారిని మంగళవారం దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో మద్ది క్షేత్ర చైర్మన్‌ మద్దాల ప్రసాద్‌, కార్యనిర్వహణాధికారి ఎన్‌ఎస్‌ చక్రధరరావులు స్వాగతం పలికారు. మంత్రి ఆంజనేయస్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేద్రం త్వరగా న్యాయం చేయాలని కోరుకుంటున్నామని అన్నారు. ఆయన వెంట అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వరరావు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *