Monday, 2 November 2026

బడ్జెట్‌లో భారీ సంస్కరణలుకేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ

5

న్యూఢిల్లీ, నవంబరు 24 (జనంసాక్షి) : బడ్జెట్‌లో భారీఎత్తున సంస్కరణలు చేపట్టనున్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు. ఈ బజ్టెట్‌లో రెండో తరం  ఆర్థిక సంస్కరణలను పూర్తిస్థాయిలో ఆవిష్కరించనున్నట్లు న్యూఢిల్లీలో ఆయన చెప్పారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంస్కరణల జోరు పెంచేసింది. ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మడం, బీమా, బ్యాంకింగ్‌ వంటి కీలక మైన ఫైనాన్స్‌ రంగాల్లోకి విదేశీ పెట్టుబడులకు మరింతగా తలుపులు తెరవడం, కార్మిక చట్టాలకు తూట్లు పొడవడం వంటి అనేక ప్రజావ్యతిరేక చర్యలు చేపట్టింది. వీటితో ప్రభుత్వం సంతృప్తి చెందలేదు. ఇప్పుడు రెండో విడత సంస్కరణలను పూర్తిస్థాయిలో అమలు చేయ డానికి బడ్జెట్‌ను వేదికగా చేసుకుంటున్నది. ముందున్నది మరింత ఉత్కంఠభరితమైన కాలమని ఆయన అన్నారు. మరిన్ని రంగాలను పెద్దయెత్తున ప్రైవేటు, విదేశీ పెట్టుబడులకు తెరవడం, విధానాలను, పన్నుల వ్యవస్థను పెట్టుబడికి అనుకూలంగా వుండేలా చూడడం ఈ రెండోతరం సంస్కరణల్లో కీల కాంశంగా వుంటుందని జైట్లీ ఇక్కడ పిటిఐ ప్రధాన కార్యాలయంలోని పాత్రికేయులతో జరి పిన ఇష్టాగోష్టిలో చెప్పారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి 6 శాతం దాటేలా చూడడమే ఈ చర్యల ఉద్దేశమన్నారు. ప్రస్తుతం అసంపూర్తిగా మిగిలివున్న కోల్‌ ఆర్డినెన్స్‌, ప్రైవేట్‌ రంగానికి సహజ వనరులు అప్ప గింత, పన్నుల హేతుబద్ధీకరణ (ప్రత్యక్ష పన్నులు తగ్గించి పరోక్ష పన్నుల పెంపు), భూ సేకరణ (సవరణ) చట్టంలో మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తుందని ఆయన చెప్పారు. అత్యంత కనిష్ట స్థాయికి ఆర్థిక పతనం చేరుకుందని, అయితే దీనిపై గుండెలు బాదుకోవాల్సినవసరం లేదని, గత ఆరుమాసాలుగా దేశీయ పెట్టుబడిదారులు, విదేశీ పెట్టుబడిదారులు భారత ఆర్థిక వ్యవస్థపై గురి కుదిరందని, వీరిలో విశ్వాసం పెంపొందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కొద్ది కాలంలోనే మంచి ఫలితాలిస్తాయని ఆయన అన్నారు. పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని జైట్లీ చెప్పారు. విదేశీ పెట్టుబడిదారులు ఈ దేశంలో రాజకీయ సుస్థిరత, విధానాలు, పన్నుల వ్యవస్థలో సుస్థిరత రావాలని కోరుకుంటున్నారని జైట్లీ చెబుతూ ఇందుకు అవసరమైన దిద్దుబాటు చర్యలను తన ప్రభుత్వం పెద్దయెత్తున చేపడుతుందన్నారు. హైవేలు నిర్మించడం, విద్యుత్‌ ఎ/-లాంట్లను నెలకొల్పడం, వారికి బొగ్గు గనులను అప్పగించడం, పెట్టుబడికి అవసరమైన రుణాన్ని అందించడం వంటి వాటికి ఎన్డీయే ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. వచ్చే వారం జరిగే భారతీయ రిజర్వు బ్యాంకు ద్రవ్య పాలసీ సవిూక్షలో వడ్డీ రేట్ల తగ్గింపు ప్రధాన అంశంగా వుండబోతుందన్నారు. సంవత్సరంలో 365 రోజులూ సంస్కరణలు జరుగుతూనే వుంటాయని ఆర్థిక మంత్రి చెప్పారు. రెండో తరం సంస్కరణల పక్రియ బడ్జెట్‌కు ముందు తరువాత కూడా కొనసాగుతుందన్నారు. ఈ సంస్కరణలను పూర్తి స్థాయిలో చేపట్టేందుకు బడ్జెట్‌ ఒక ముఖ్యమైన సాధనంగా వుండబోతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం తక్షణం దృష్టిసారించాల్సిన వాటిలో బీమా సవరణ బిల్లు, కోల్‌ ఆర్డినెన్స్‌, జిఎస్‌టి బిల్లు వున్నాయన్నారు. బ్యాంకింగ్‌ రంగంలో సంస్కరణల గురించి అడిగిన ఒక ప్రశ్నకు ఆయన బదులిస్తూ బేసెల్‌-3 నిబంధనల మేరకు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను 52 శాతానికి కుదిస్తామన్నారు. బిజెపి ప్రభుత్వం ఏర్పాటయ్యాక సామాన్యుడు ధరల అదుపుపై భారీ ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఆ దిశగా ప్రభుత్వం ఏ మేరకు నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *