Tuesday, 3 November 2026

హింస అభివృద్ధి ఆటంకం జార్ఖండ్‌ ఎన్నికల సభలో సోనియా

ఆదివాసీలకే అటవీ సంపద

పేదలను భాజపా విస్మరించింది
4

జార్ఖండ్‌, నవంబరు 24 (జనంసాక్షి) : హింస దేశాభివృద్ధికి ఆటంకమని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. ఆదివాసీలకే అటవీ సంపద చెందాలన్నారు. పేదలను భారతీయ జనతాపార్టీ పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. సోమవారం జార్ఖండ్‌ ఎన్నికల ప్రచారం సభలో ఆమె ప్రసంగించారు. ఆఖరిరోజు బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేశాయి. ఈ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ విస్తృతంగా ప్రచారం చేశారు.  జార్ఖండ్‌లోని డాల్టన్‌గంజ్‌, గుమ్లాలలో జరిగిన ఎన్నికల బహిరంగ సభ ల్లో పాల్గొన్న సోనియా ప్రస్తుతం ఉగ్రవాద సమస్య  దేశ న్యాయవ్యవస్థకు సవాల్‌గా మారడమే కాకుండా అభివృద్ధికి ఆటంకంగా పరిణమించిందన్నారు. మావోయిస్టులు ఆయుధాలు వీడి జన జీవన శ్రవంతిలో కలిసిపోవాలని పిలుపునిచ్చారు. దేశంలోని సహజ వనరులు ప్రజల సొత్తు, వాటిని ప్రజల అభివృద్ధి కోసమే వినియోగించాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు.  పేదల అభ్యన్నతి కోసం, గిరిజనుల కోసం సహజ వనరులను వినియోగించాలన్నది తమ పార్టీ విధానమని ఆమె తెలిపారు. సహజ వనరులన్నీ ప్రజల చేతుల్లో వుండాలని, ప్రభుత్వం చేతుల్లో కాదని, ఇది ప్రభుత్వ సొత్తు కాదని అన్నారు. పేదలు, గిరిజనులు, ఆదివాసీలు, దళితులు, వెనుకబడిన వర్గాలు, మైనార్టీల అభివృద్ధి కోసం సహజ వనరులను వినియోగించాలన్నదే తమ అభిమతమని అన్నారు. దీంట్లో భాగంగానే వీరందరికీ కొన్ని హక్కుల కల్పించామని, భూ సవిూకరణ చట్టాన్ని తీసుకొచ్చామని అన్నారు. అణగారిన వర్గాల హక్కులను కాలరాసే విధంగా కొత్త భూసేకరణ చట్టానికి బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం రూపకల్పన చేస్తోందని ఆమె విమర్శించారు. ప్రస్తుతమున్న భూ సేకరణ చట్టంలో ఎలాంటి మార్పునైనా తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు. యుపిఎ తీసుకొచ్చిన పథకాల వల్లే భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందిందన్నారు. ఇటీవల ఎన్నికల సభలో జార్ఖండ్‌ వెనుకబాటుపై ప్రధాని మోడీ చేసిన విమర్శలను సోనియా ఈ సందర్భంగా పరోక్షంగా ప్రస్తావిం చారు. జార్ఖండ్‌ రాష్ట్రం ఏర్పడిన అనంతరం 14 ఏళ్లలో 11 సంవత్సరాలు బిజెపి అధికారంలో వుందని, అలాంటప్పుడు రాష్ట్ర వెనుకబాటుకు బిజెపియే కారణమని అన్నారు. జార్ఖండ్‌ అభివృద్ధి కోసం గత యుపిఎ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు అందజేసిందని, తాగునీరు, వైద్యం తదితర రంగాలఅభివృద్ధి నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం వృధా చేసిందని ఆరోపించారు. 14 సంవత్సారాల క్రితం జార్ఖండ్‌ ఏర్పడినపుడు కేవలం మూడు జిల్లాలలోనే నక్సల్‌ సమస్య ఉండేదని, అయితే ఇప్పుడది రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పాకిపోయిందని అన్నారు. కాగా కాంగ్రెస్‌చేసిన కృషితో ఆదివాశీలు, పేదలు, దళితులు, వెనుకబడిన, బలహీన వర్గాలవారికి భూములపై హక్కులను కల్పిస్తూ అధికారాల్చినప్పటికీ బిజెపి ప్రభుత్వం ఆ భూములును స్వాధీనం చేసుకునే పనిలో పడిందని తెలిపారు.బిజెపి జార్ఖండ్‌లోని చోటా నాగపూర్‌ తదితర ప్రాంతాలలో అభివృద్ధి పనుల పేరుతో దళితులకు భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. దీనిపై అక్కడి దళితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. కా గా తాము అభివృద్ధి పనులను ఎన్నడూ అడ్డుకోమని, గత యుపిఎ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమపథకాలు, అభివృద్ధి పనులు ఈ రోజు దేశం అభివృద్ధికి దోహదపడుతున్నాయన్నారు. దేశాభివృద్ధి విషయంలో కాంగ్రెస్‌ ఎంతగానో కృషి చేసిందన్నారు. యుపిఎ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జార్ఖండ్‌ అ భివృద్ధికి,ఇక్కడి దళితుల సంక్షేమానికి ఎంతగానో పాటుపడిందని ఈనేపధ్యం లోనే విద్య, వైద్య ఆరోగ్య, రోడ్లు తదితర అంశాల్లో పలు అభివృద్ధి పనులు చే పట్టిందని సోనియా అన్నారు. కాగా జార్ఖండ్‌లో 40 లక్షలకుపై బడిన జనాభా దారిద్యర్రేఖకు దిగువన ఉందని, ఇది చాలా ఆందోళనకరమైన అంశమని సో నియా చెప్పారు. జార్ఖండ్‌లో నవంబరు 25న జరిగే తొలి దశ పోలింగ్‌ కోసం ప్రచారం చివరి రోజున సోనియా గాంధీ కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతుగా సభ ల్లో పాల్గొన్నారు. ప్రచార పర్వం ముగియండో కాంగ్రెస్‌ జార్ఖండ్‌పై భారీగానే ఆశలు పెట్టుకుంది. ఈ పోరులో ఎవరు గులుస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *