కడప:కరెంట్ ఛార్జీల పెంపుకు నిరసనగా చేపట్టిన బంద్ మంగళవారం బద్వేల్‌లో ఉద్రికత్తలకు దారితీసింది. బంద్ నిర్వహిస్తున్న మహిళలపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. బంద్ చేస్తున్న మహిళలను పోలీసులు అడ్డుకోవడంతో తోక్కిసలాట జరిగింది. ఈ తోక్కిసలాటలో ఇద్దరు మహిళలు స్పృహ కోల్పోయారు.




