Tuesday, 3 November 2026

బలపరీక్షలో హరీశ్‌ నెగ్గారు

11brk82a
సుప్రీంకోర్టుకు తెలిపిన ఏజీ
సీఎం పదవి చేపట్టాలని సూచించిన కోర్టు

ఉత్తరాఖండ్ : ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి హరీష్ రావత్ బలపరీక్షలో విజయం సాధించారు. బుధవారం సుప్రీం కోర్టు ఉత్తరాఖండ్ బలపరీక్ష ఫలితాలను వెల్లడించింది. బలపరీక్షలో హరీష్‌రావత్ ప్రభుత్వం నెగ్గినట్లు సుప్రీం పేర్కొంది. రావత్‌కు మద్దతుగా 33 మంది ఎమ్మెల్యేలు, వ్యతిరేకంగా 28 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. బలపరీక్షలో నెగ్గిన హరీష్‌రావత్ మరోసారి సీఎం పదవిని చేపట్టనున్నారు. ఈ తీర్పుతో ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తామని అటార్నీ జనరల్ సుప్రీంకోర్టుకు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *