Tuesday, 3 November 2026

విరాట్‌పై మనసు పారేసుకున్న బ్యూటీ

ముంబయి: అద్భుతమైన ఆటతీరుతో పాటు తన లైఫ్‌స్టైల్‌తో ఎందరో అమ్మాయిలకు ఆరాధ్యుడయ్యాడు భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి. బాలీవుడ్‌ హీరోలతో సమానంగా క్రేజ్‌ సంపాదించుకుని యూత్‌కు ఐకాన్‌ మారిపోయాడు. బాలీవుడ్‌ హీరోయిన్లే అతడితో డేట్‌కు వెళ్లాలని ఆశపడుతున్నారంటే అతడి క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు.

‘విరాట్‌ అంటే నాకు ఎంతో ఇష్టం. నేను అతడిని ప్రేమిస్తున్నా. దీనిపై అనుష్క ఏమనుకున్నా నాకు సంబంధం లేదు’ అంటూ కొద్దిరోజుల క్రితం ఐటెం గర్ల్‌ రాఖీసావంత్‌ బహిరంగంగా కామెంట్‌ చేసింది. తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ ప్రాచీ దేశాయ్‌ కూడా కోహ్లిపై మనసు పారేసుకుంది. అతడితో డేటింగ్‌కు వెళ్లాలని ఉందంటూ ‘అజర్‌’ ప్రచార కార్యక్రమంలో తన మనసులో మాట బయటపెట్టింది. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మరో అందగత్తె నర్గిస్‌ ఫక్రి.. సచిన్‌తో డిన్నర్‌ చేయాలని తన ఇష్టాన్ని చెప్పుకొచ్చింది. వీరిద్దరూ ‘అజర్‌’ చిత్రంలో ఇమ్రాన్‌ హష్మికి జంటగా నటించారు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *