Thursday, 5 November 2026

బాబుది అధర్మ దీక్ష: కోలగట్ల

 విజయనగరం,మే23( జ‌నం సాక్షి): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తుంది ధర్మపోరాట దీక్ష కాదు.. అధర్మ పోరాట దీక్ష అని వైసిపి ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి విమర్శించారు. బుధవారం ఉదయం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్లు బిజెపితో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన చంద్రబాబు ఇప్పుడు ఎవరి విూద ధర్మపోరాటం చేస్తున్నారని ప్రశ్నించారు. కళ్లబల్లి విూటలతో ప్రజలను మభ్యపెట్టేందుకు సిఎం ప్రయత్నిస్తున్నారన్నారు. బాబు హయంలో రాష్ట్రం అథోగతిపాలయిందన్నారు.