బాబు బండారం బయటపడింది: వైకాపా

ఏలూరు,జూన్‌26(జ‌నం సాక్షి): ఓట్ల కోసం బాబు ఎన్నిఎత్తులయినా వేస్తారని,ఆయన కార్యక్రమాలన్నీ వచ్చే ఎన్‌ఇనకలే లక్ష్యంగా సాగుతున్నాయని వైకాపా జిల్లా అధ్యక్షుడు,ఎమ్మెల్సీ ఆళ్లనాని అన్నారు. బాబు నిజస్వరూపం బయటపడిందని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం వెనక కోట్లాది రూపాయల అవినీతి కోణం దాగుందని ఆరోపించారు. రాష్ట్రంలో పాలన బాధ్యతారాహిత్యంగా సాగుతోందని ప్రశ్నించే ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారని విమర్శించారు. రుణమాఫీ చేస్తానని రైతులకు హావిూ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కేవలం రూ.9 వేల కోట్లే మాఫీ చేసి మోసం చేరన్నారు. ముస్లింలు, గిరిజనులకు మంత్రివర్గంలో ప్రాతినిథ్యం లేకుండా చేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అవినీతి పాలన కొనసాగుతుందన్నారు. సామాన్యుడు కడుపునింపుకోలేని దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ఇసుక దోపిడీ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుందన్నారు. టిడిపి వారికి ఇది ఆదాయవనరుగా మారిందన్నారు.