బాలికపై అత్యాచార యత్నం
పోలీసుల అదుపులో ఆర్‌ఎంపి వైద్యుడు
అమరావతి,జూలై30(జనం సాక్షి): వైద్యవృత్తికి కళంకం తెచ్చేలా ప్రవర్తించాడో ప్రబుద్దుడు. వైద్యం కోసం వచ్చిన బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఆర్‌ఎంపి వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కృష్ణా జిల్లా కందుకూరులో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం బాలికను పరీక్షించిన అనంతరం ఆర్ ఎంపి వైద్యుడు మొహియుద్దీన్ అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. బాలిక భయంతో కేకలు వేసింది. దీంతో గ్రామస్థులు మొహియుద్దీన్ ను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మొహియుద్దీన్ స్వస్థలం ప్రకాశం జిల్లా కందుకూరుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.