Monday, 2 November 2026

‘బాలికా వధు’ ఆనంది ఆత్మహత్య

2

హిందీ సీరియల్ బాలికా వధులో ఆనంది పాత్ర పోషించిన నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకుంది. ముంబైలోని తన ఇంట్లో ఆమె ఉరేసుకున్నది. ఆమెను కోకిలా బెన్ ఆస్పత్రికి తరలించి వైద్యసహాయం అందిస్తుండగానే చనిపోయినట్టు సమాచారం. తన బోయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్ ని పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రత్యూష.. అతనితో విభేదాల వల్ల డిప్రెషన్ కు గురైందని, దానివల్లనే ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని ప్రాథమికంగా సమాచారం అందుతోంది.
హిందీలో అత్యంత ప్రజాధరణ పొందుతున్న బాలికా వధు సీరియల్ ని తెలుగులో చిన్నారి పెళ్లికూతురు పేరుతో అనువదించి ప్రసారం చేస్తున్నారు. ఈ సీరియల్ లో ఆనంది పాత్ర పోషిస్తున్న అవికా గోర్ సినిమాల్లోకి రావడంతో.. ఆమె స్థానంలో ప్రత్యూష నటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *