బిజెపి నేతలవి అర్థం లేని విమర్శలు
మండిపడ్డ టిడిపి నేతలు
విజయవాడ,మే3(జనం సాక్షి): బిజెపి విష్ణుకుమార్రాజు జ్యోతిష్యుడిలా మారారని మంత్రి జవహర్ ఎద్దేవా చేశారు. గురువారం విూడియాతో మాట్లాడుతూ వైసీపీ మోజులో పడి టీడీపీపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. విష్ణుకుమార్రాజు మానసిక స్థితి బాగాలేనట్టుందని మంత్రి వ్యాఖ్యానించారు. దేవుడి గుడి నుంచి బయటకు వస్తే పవిత్రమైన మనసు ఉండాలని, తిరుపతి వెంకన్న సన్నిధిలోనే అబద్ధాలు చెబుతున్నారని మంత్రి జవహర్ అన్నారు. గతంలో ఏం మాట్లాడారు..ఇప్పుడేం మాట్లాడుతున్నారో గుర్తు చేసుకోవాలన్నారు. ఇదిలావుంటే బీజేపీ జగన్తో కలిసి లాలూచీ రాజకీయాలు చేస్తోందని, బీజేపీ నేతలు వైసీపీలో చేరుతారా? అంటూ ఎమ్మెల్యే బోండా ఉమ ప్రశ్నించారు. బీజేపీకి డిపాజిట్లు రావని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీదే అధికారమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం నిధులు ఇస్తుంటే రాష్ట్రం వద్దన్నద్దని బీజేపీ నేత జీవీఎల్ నరసింహరావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతలు వైసీపీని చూసుకొని అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, బీజేపీకి బుద్దిచెప్పడానికి కర్నాటక ఓటర్లు సిద్ధంగా ఉన్నారని బోండా ఉమ హెచ్చరించారు.
—————-