బిజెపి నేతలవి రెచ్చగొట్టే వ్యాఖ్యలు
విభజన హావిూలు అమలు చేయించి సత్తా చాటాలి: ప్రకాశ్ నాయుడు
అనంతపురం,జూలై7(జనం సాక్షి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రజలను రెచ్చగొడుతున్న తీరు దారుణమని మాంసపు ఉత్పత్తుల అభివృద్ధి సంస్థ చైర్మన్, చంద్రదండు వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రకాశ్ నాయుడ అన్నారు. దమ్ముంటే విభజన హావిూలు అమలు చేసేలా ఈ నేతలు కృషి చేయాలన్నారు. ఎపికి అన్యాయం జరుగుతుంటే ఎదురుదాడి చేస్తారా అని ప్రశ్నించారు. అలాగే కేంద్రం చేస్తున్న మోసంపై ఎందుకు నోరుమెదపరని వైసీపీ, జనసేన పార్టీనేతలు జగన్, పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు. నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం తీరని అన్యాయం చేసిందన్నారు. అయినా ఏపీని అన్ని విధాలుగా ఆదుకున్నామని, ప్రత్యేక ¬దా ఏ రాష్టాన్రికీ ఇవ్వలేమని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందన్నారు. ఇంత మోసం చేస్తున్నా, వైసీపీ, జనసేన నేతల కళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. బీజేపీకి జగన్, పవన్ తొత్తులుగా మారి ఆంధప్రదేశ్‌కు మరింత అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో ఓబుళాపురం గనులు దోచుకున్నారన్నారు. కృష్ణపట్నం రహదారులు సర్వనాశనం చేశారన్నారు. గిరిజనుల ఆరాధ్యదైవమైన సుంకులమ్మ దేవాలయాన్ని కూల్చి గనులు దోచుకున్నారన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ స్థాపన పేరుతో గాలి జనార్దన్‌రెడ్డికి కారుచౌకగా భూములు కేటాయిస్తే.. వాటిని తాకట్టు పెట్టి రూ. 1500 కోట్ల రుణాలు తీసుకున్నారన్నారు. ప్రహరీ గోడ కట్టి మిగిలిన సొమ్ము స్వాహా చేశారని ఆరోపించారు. రాష్ట్రం కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం చంద్రబాబుకే ప్రజలు అండగా నిలుస్తారన్నారు.
—–