బిజెపి నేతలే టిడిపిపై దాడి చేశారు: ఎమ్మెల్యే సుగుణమ్మ

చిత్తూరు,మే11(జ‌నం సాక్షి ):  తిరుపతిలో అమిత్‌ షా కాన్వాయ్‌పై దాడి అబద్ధమని తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే సుగుణమ్మ కొట్టిపారేశారు. అవసరమైతే సీసీ కెమెరాలు పరిశీలించుకోవచ్చని స్పష్టం చేశారు. టీడీపీ కార్యకర్తలపైనే బీజేపీ నేతలు, వాళ్ల అనుచరులు దాడి చేశారని చెప్పారు. టీడీపీ కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన తెలుపుతున్న సమయంలో అమిత్‌ షా కాన్వాయ్‌ వెళ్లిందన్నారు. కాన్వాయ్‌ వెళ్లగానే బీజేపీ నేతలు వచ్చి దాడి చేశారని తెలిపారు. శ్రీకాళహస్తికి చెందిన బీజేపీ నేత కోలా ఆనంద్‌ అనుచరులు.. గడ్డం ఉన్న మరో వ్యక్తి జెండా కర్రలతో టీడీపీ శ్రేణులపై దాడి చేశారని వెల్లడించారు. బీజేపీ నేతలు చేసిన పనికి టీడీపీ కార్యకర్తలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని సుగుణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

తాజావార్తలు