బిడ్డకు కారుణ్య మరణం ప్రసాదించండి: తల్లిదండ్రుల మొర

చిత్తూరు,ఆగస్ట్‌30: ఇక తమ బిడ్డ కోలుకోదని గ్రహించిన ఓ తల్లిదండ్రులు తమబిడ్డకు కారణ్యమరణాన్ని ప్రసాదించాలని వేడుకున్నారు. శక్తికి మించి ఖర్చు చేసినా తమ కూతురిని కాపాడుకోలేని పరిస్థితి రావడంతో చివరకు వారు ఈ ప్రయత్నం చేపట్టారు. తమ కళ్ల ముందే నరకయాతన పడుతున్న కుమార్తె ను చూడలేని ఆ తల్లిదండ్రులు కారుణ్య మరణానికి అనుమతించాలంటూ కోర్టును ఆశ్రయించారు. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం తెట్టు గ్రామానికి చెందిన బొగ్గల చిన్నరెడ్డప్ప, సునిత దంపతుల ఆరేళ్ల కూతురు శృతిహాసిని గత కొన్నేళ్లుగా న్యూరోప్రైబోమా వ్యాధితో బాధపడుతోంది.

ఎన్ని ఆస్పత్రులు తిరిగినా లాభం లేకుండాపోయింది. ప్రైవేట్‌ వైద్యం చేయించే స్థోమత లేక మానసికంగా కుంగిపోయారు. దీంతో చేసేదేమి లేక మెడ నొప్పితో కూతురు చేస్తున్న ఆర్తనాదాలు వినే ఓపిక తమకు లేదని.. తమ కూతురికి కారుణ్య మరణం ప్రసాదించమని కోరుతూ ఆ జంట మదనపల్లి రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి కేవీ మహాలక్ష్మీకి అర్జీ పెట్టుకున్నారు.

తాజావార్తలు