ఇండియాస్ డాటర్ పేరుతో నిర్భయ కేసుపై తీసిన డాక్యుమెంటరీని బీబీసీ బ్రిటన్ లో ప్రసారం చేసింది. ప్రసారంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించినా బీబీసీ ఖాతరు చేయలేదు. బీబీసీ తీరుని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తప్పుపట్టారు. ఆ డాక్యుమెంటరీని ప్రసారం చేయొద్దని తాము నోటీస్ పంపినప్పటికీ.. బీబీసీ నిబంధనలు ఉల్లంఘించిందన్నారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకునేది త్వరలోనే చెప్తామన్నారు.
ఇండియాస్ డాటర్ పై పార్లమెంటులో ప్రతిపక్షాలు తీవ్రంగా విరుచుకుపడటంతో పాటు, దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమయ్యింది. దీంతో ఈ డాక్యుమెంటరీ ప్రసారంపై కేంద్రం నిషేధం విధించింది.
బీబీసీ తీరుపై రాజ్ నాథ్ అసంతృప్తి




