Monday, 2 November 2026

బెంగళూరు ఓటమికి కారణం అదే… బలంగా నమ్ముతున్న ఫ్యాన్స్ !

ఐపీఎల్ తుది పోరులో హైద్రాబాద్ సన్‌రైజర్స్ విజేతగా నిలిచింది. కోహ్లీ నాయకత్వం వహించిన బెంగళూరు టీమ్ ఓటమిపాలైంది. అయితే మ్యాచ్ ఓటమికి కారణాలు ఇవేనని రకరకాల వార్తలొస్తున్నాయి. అయితే మ్యాచ్ ఓటమికి కారణం కోహ్లీ ఆరెంజ్ క్యాపేనని కొంతమంది క్రికెట్ సెంటిమెంట్ అభిమానులు వాదిస్తున్నారు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లకు ఆరెంజ్ క్యాప్ ఇస్తారు. ఈ ఆరెంజ్ క్యాప్ ధరించిన బ్యాట్స్‌మెన్ వ్యక్తిగత స్కోర్‌పరంగా రాణించినా జట్టు మాత్రం గెలవదట. ఈ సెంటిమెంట్ సచిన్, షాన్ మార్ష్ విషయంలో నిజమైందని ఐపీఎల్ ఫ్యాన్స్ చెప్పుకునేవారు. ఇప్పుడు కోహ్లీ విషయంలో కూడా ఈ విషయం రుజువైందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *