బెంగుళూరు హాస్టల్లో తూటాల మోత

1A

 

1

అక్కడికక్కడే విద్యార్థిని మృతి, నిందితుడు అరెస్ట్‌

బెంగళూరు,ఏప్రిల్‌1(జనంసాక్షి): బెంగళూరులో మరో ఘాతుకం జరిగింది. ప్రేమ పేరుతో కాలేజీ అటెండర్‌ ఓ విద్యార్థినిని బలి తీసుకున్నాడు. అతి కిరాతకంగా కాల్చి చంపాడు. బెంగళూరులోని వైట్‌ ఫీల్డ్‌ లో ప్రగతి రెసిడెన్షియల్‌ కాలేజీలోదారుణం జరిగింది. గౌతమి అనే విద్యార్థినిని అంటెడర్‌ మహేష్‌ కాల్చి చంపాడు. ఇంటర్‌ సెంకండియర్‌ చదువుతున్న గౌతమిని అటెండర్‌ మహేష్‌ గత కొద్ది రోజులుగా ప్రేమించమంటూ వేధింపులకు గురిచేశాడు. అయితే గౌతమి అతని ప్రేమ నిరాకరించడంతో పాటు వేధిస్తున్నట్లు పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. దీంతో క్షక్ష్య గట్టిన మహేష్‌ గత రాత్రి లేడీస్‌ హాస్టల్‌కు చేరుకుని కాల్పులు జరిపాడు. పాయింట్‌ బ్లాక్‌ రేంజ్‌లో కాల్పులు జరపడంతో గౌతమి అక్కడికక్కడే మృతి చెందింది. అడ్డుకోబోయిన శిరీష అనే మరో విద్యార్థిని గాయపడింది. ఘటన తర్వాత అటెండర్‌ మహేష్‌ పరారీలో ఉన్నాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు. మహేష్‌ తుపాకీని ఎక్కడి నుంచి తెచ్చాడనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన విద్యార్థులు హాస్టల్‌ను ఖాళీ చేసి వెళ్లిపోయారు.  ఇద్దరు విద్యార్దులపై అటెండర్‌ కాల్పులు జరిపినట్లు సమాచారం వచ్చింది.గౌతమి, శిరీష అనే విద్యార్దులపై అతను కాల్పులు జరపగా గౌతమి అనే విద్యార్ది మరణించగా, శిరీష తీవ్రంగా గాయపడింది.అటెండర్‌ మహేష్‌ ఆ తర్వాత పరారయ్యాడు. మహేష్‌ వద్ద తుపాకి ఎలా వచ్చిందో , ఎందుకు కాల్పులు జరిపాడో పూర్తి గా గౌతమి అనే విద్యార్ది మరణించగా, శిరీష తీవ్రంగా గాయపడింది.అటెండర్‌ మహేష్‌ ఆ తర్వాత పరారయ్యాడు. మహేష్‌ వద్ద తుపాకి ఎలా వచ్చిందో , ఎందుకు కాల్పులు జరిపాడో పూర్తి గా వివరాలు సేకరిస్తున్నారు. అయితే తనను ప్రేమించాలని అడిగాడని, అందుకు అంగీకరించకపోవడంతో వారిపై కాల్పులు జరిపాడని సమాచారం.  దీంతో కాలేజీలో భయానక వాతావరణం ఏర్పడింది. పిల్లలు భయభ్రాంతులకు లోనయ్యారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు.

విద్యార్థిని గౌతమిని హాస్టల్‌ లో కాల్చి చంపిన నిందితుడు మహేష్‌ ను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో గౌతమిని హత్య చేసిన నిందితుడు అక్కడి నుండి పరారైనాడు. పోలీసు అధికారులు మూడు ప్రత్యేక బృందాలు ఎర్పాటు చేసి నిందితుడి కొసం గాలించారు. మహేష్‌ మొబైల్‌ నెంబరుతో పాటు అతని కుటుంబ సభ్యులు, స్నేహితుల మొబైల్‌ నెంబర్లు ట్రేస్‌ చేశారు. కేఆర్‌ పురం రైల్వే స్టేషన్‌ సవిూపంలోని వైట్‌ ఫీల్డ్‌ మెయిన్‌ రోడ్డులోని బి. నారాయణ పురలోని అక్క ఇంటిలో మహేష్‌ తలదాచుకున్నాడని పోలీసులు గుర్తించారు. చేతులు జోడించిన గౌతమి తండ్రి: మహేష్‌ అరెస్టు బుధవారం మద్యాహ్నం మహేష్‌ అక్క ఇంటిలో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కాడుగోడి పోలీసులు మహేష్‌ ను విచారిస్తున్నారు. విషయం తెలుసుకున్న డీసీపీ రోహిణి కాడుగోడి పోలీస్‌ స్టేషన్‌ చేరుకున్నారు.

మరోవైపు తన కూతురిపై తప్పుడు ప్రచారం చేయరాదని గౌతమి తండ్రి రమేష్‌ కన్నీరు మున్నీరయ్యారు. ఐటి విూద ఆసక్తి ఎక్కువగా ఉన్న గౌతమి (18) సీఇటి పరిక్షలు వ్రాయడానికి సిద్దం అవుతున్నది. అందు వలన ఆమె కాలేజ్‌ హాస్టల్‌ లో ఉంటు చదువుకుంటున్నదని, ఆమె ఎవరి ప్రేమలో పడలేదని, దయచేసి తప్పుడు ప్రచారం చెయ్యరాదని గౌతమి తండ్రి మనవి చేశారు.