బెంజ్ నుంచి బీ-క్లాస్ న్యూ వెర్షన్

8phwfbylలగ్జరీకార్ల సంస్థ మెర్సిడెజ్ బెంజ్.. బీ-క్లాస్లో కొత్త వెర్షన్ ను విడుదల చేసింది. పె ట్రోల్, డీజిల్ రకాల్లో లభించనున్న ఈ కారు ముంబై షోరూంలో రూ.27.95 లక్షల నుంచి రూ.28.95 లక్షల మధ్యలో లభించనున్నది. బీ180 స్పోర్ట్, బీ 200 సీడీఐ స్పోర్ట్ రెండు రకాల్లో విడుదల చేసిన ఈ కారు దేశవ్యాప్తంగా ఉన్న మెర్సిడెజ్-బెంజ్ షోరూంలలో లభ్యమవనున్నది. దీంట్లో 1.8 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ తో రూపొందించిన బీ 180 స్పోర్ట్స్ మోడల్ ధర రూ.27.95 లక్షలుగా నిర్ణయించిన సంస్థ, 2.2 లీటర్ల డీజిల్ ఇంజిన్ కలిగిన బీ 200 స్పోర్ట్ కారును రూ.28.95 లక్షలుగా విక్రయించనున్నట్లు తెలిపింది.