Tuesday, 3 November 2026

బోరు బావి బాలిక సురక్షితం

3

రంగారెడ్డి జనవరి13(జనంసాక్షి): జిల్లా గండేడు మండలం గోవిందపల్లి తండాలో బోరు బావిలో పడిన ఆరేళ్ల అంజలి క్షేమంగా బయట పడింది. దాదాపు ఎనిమిది అడుగుల లోతులో పడిపోగా రెవెన్యూ పోలీసు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి పాపను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం ఆరోగ్య పరీక్షల నిమిత్తం మహబూబ్‌నగర్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పాప తండ్రి దుబాయ్‌లో ఉండగా, తల్లి పూణెకు వలస వెళ్లారు. తల్లిదండ్రులు వలస వెళ్లడంతో అంజలి బంధువుల ఇంట్లో ఉంటోంది. మృత్యు ఒడిలోంచి బయట పడ్డ పాపను చూసేందుకు పరిసరగ్రామ ప్రజలు తండోపతండాలుగా అక్కడకు చేరుకున్నారు. పాప ప్రాణాలతో బయటపడడంతో అధికారులు వూపిరి పీల్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *