
హైదరాబాద్,జనవరి13(జనంసాక్షి): ప్రముఖ నిర్మాత, దర్శకుడు వి.బి.రాజేందప్రసాద్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్, సినీనటుడు ఆర్.నారాయణమూర్తి, నిర్మాత సి.కల్యాణ్ తదితరులు రాజేందప్రసాద్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. వీబీ కుటుంబ సభ్యులను ఓదార్చారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఫిల్మ్‌నగర్‌లోని వి.బి.రాజేందప్రసాద్ నివాసానికి సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చి నివాళులర్పించారు. వీబీతో ఉన్న అనుంబంధాన్ని గుర్తు చేసుకుంటూ విచారం వ్యక్తం చేశారు. సినీ నటులు మోహన్‌బాబు, వెంకటేష్, సుశాంత్, దర్శకులు రాఘవేంద్రరావు, వి.వి.వినాయక్, ఎస్.వి.కృష్ణారెడ్డి, నిర్మాతలు సురేష్‌బాబు, అచ్చిరెడ్డి, శ్యాంప్రసాద్‌రెడ్డి, మా అధ్యక్షుడు మురళీమోహన్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, ఎల్వీ సంస్థల అధినేత రమేష్ ప్రసాద్, తెదేపా తెలంగాణ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు వీబీ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
వీబీకి ప్రముఖుల నివాళి




