Tuesday, 3 November 2026

మలుపు తిరిగిన కాశ్మీర్‌ రాజకీయం

6

పీడీపీకి ఎన్‌సీ మద్దతు

జమ్మూకశ్మీర్‌ జనవరి13(జనంసాక్షి): జమ్ముకాశ్మీర్‌లో పీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తాము మద్దతిస్తామని ఎన్‌సీనేత ఒమర్‌ అబ్దుల్లా గవర్నర్‌కు లేఖ రాశారు. జమ్మూకశ్మీర్‌కు 11వ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒమర్‌ అబ్దుల్లా గత డిసెంబరులో ఎన్నికల్లో పార్టీ ఓటమి నేపథ్యంలో రాజీనామా చేశారు. ఏ పార్టీకీ పూర్తి స్థాయి ఆధిక్యం రాని కారణంగా కశ్మీర్‌లో ఫలితాలు వెలువడి 20 రోజులు కావస్తున్నా ఇంతవరకూ ప్రభుత్వం ఏర్పడలేదు. మరో వైపు బీజేపీ ప్రభుత్వం కాశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు రాజకీయ ఎత్తుగడలు సాగిస్తుంది. మోజార్టీ పార్టీకి మద్దతువ్వడానికి పావులు కదుపుతుంది. ఇటివలే బీజేపీ అధ్యక్షులు కాశ్మీర్‌లో పర్యటించి నేతలతో చర్యలు జరిపారు. ఆచి తూచి నిర్ణయం తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *