Wednesday, 4 November 2026

బ్రిటీష్ విమానంలో మంటలు

ekt9vvloఅమెరికాలోని లాస్ వెగాస్ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయ్యేందుకు రన్ వే పైకి వచ్చిన బ్రిటీష్ ఎయిర్ వేస్ విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బ్రిటీష్ ఎయిర్ వేస్ కు చెందిన బోయింగ్ 777 విమానం.. 13 మంది సిబ్బంది, 159 మంది ప్రయాణికులతో లాస్ వెగాస్ నుంచి లండన్ వెళ్లేందుకు రన్ వే పైకి వచ్చింది. పైలట్ ఫ్లైట్‌ను టేకాఫ్ చేసేందుకు ప్రయత్నిస్తుండగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో విమానం మొత్తం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఇంతలో అప్రమత్తమైన ఎయిర్ పోర్టు సిబ్బంది.. విమానం ఎమర్జెన్సీ విండోస్‌ను పగులగొట్టి ప్రయాణికులను బయటకు తీశారు. ప్రమాదంలో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *